ట్రోఫీలను ఆవిష్కరించిన మావూరి
పది రోజుల పాటు ఘనంగా నిర్వహణ
విశాఖపట్నం : వైజాగ్ జర్నలిస్టుల ఫోరం – సిఎంఆర్ ఇంటర్ మీడియా స్పోర్ట్స్ మీట్
ను జనవరి 3 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించేందుకు ప్రెస్ క్లబ్ కార్యవర్గం
ఏర్పాట్లు చేస్తోంది.విశాఖ స్పోర్ట్స్ జర్నలిస్టుల అసోసియేషన్ సహకారంతో
సిఎంఆర్ గ్రూపు సంస్థల సౌజన్యంతో ప్రతీ ఏటా నిర్వహించే ఈ స్పోర్ట్స్ మీట్ కు
సంబంధించిన ట్రోఫీలను ఆ సంస్థ అధినేత మావూరి వెంకటరమణ మంగళవారం ఆవిష్కరించారు.
ఇక్కడ జడ్జి కోర్టు సిఎంఆర్ షాపింగ్ మాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో
టోర్నీ ట్రోఫీలను ఆవిష్కరించిన అనంతరం మావూరి పాత్రికేయులతో మాట్లాడుతూ గడచిన
22 ఏళ్లుగా ఇంటర్ మీడియా స్పోర్ట్స్ మీట్ ను క్రమం తప్పకుండా వైజాగ్
జర్నలిస్ట్ లు ఫోరమ్ తో కలిసి ఘనముగా నిర్వహిస్తున్నామన్నారు. సమాజం కోసం
నిరంతరం సేవలందించే జర్నలిస్టులకు ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమన్నారు. పని
ఒత్తిడితో ఉండే జర్నలిస్టులకు ఇటువంటి క్రీడల వల్ల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు
మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల సంక్షేమానికి
తమ వంతు సహకారం అందిస్తామన్నారు.
వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ సభ్యుల
సంక్షేమమే లక్ష్యంగా తమ పాలకవర్గం పనిచేస్తుందన్నారు. ఇటీవలే దీపావళి
పర్వదినానికి సంబంధించి సుమారు రూ.8లక్షలతో బాణా సంచా పంపిణీ కార్యక్రమం
చేపట్టామన్నారు. ఆ తరువాత ప్రతిష్టాత్మకమైన అవార్డుల ప్రధానోత్సవం,
జర్నలిస్టుల పిల్లలకు ఉపకార వేతనాలు పంపిణీ పూర్తి చేశామన్నారు. సభ్యుల వైద్య
సదుపాయాలు కోసం తమ పాలక వర్గం సుమారు 23 లక్షలు కేటాఇంచడము జరిగింది
అన్నారు..2023 జనవరి 3 నుంచి 12వ తేదీ వరకు ఇంటర్ మీడియా స్పోర్ట్స్ మీట్ ను
ఘనంగా నిర్వహిస్తామన్నారు. పోర్టు ఇండోర్ స్టేడియంలో మూడు రోజుల పాటు
అథ్లెటిక్స్, చెస్, క్యారమ్స్ వంటి పోటీలు నిర్వహించగా, పోర్టు క్రికెట్
మైదానంలో జనవరి 5 నుంచి 12 వరకు క్రికెట్ పోటీలు జరుగుతాయన్నారు.
ఇందుకు సంబంధించి వీజెఎఫ్ ప్రెస్ క్లబ్ డాబాగార్డెన్స్ కార్యాలయం పనివేళల్లో
మీట్ వివరాలు తెలుసుకోవచ్చునన్నారు. వీజెఎఫ్ కార్యదర్శి దాడి రవికుమార్,
వీజెఎఫ్ ఉపాధ్యక్షులు, అవార్డుల కమిటీ చైర్మన్ ఆర్.నాగరాజ్ పట్నాయక్ లు
మాట్లాడుతూ ఔట్ డోర్, ఇండోర్ పోటీలు సందర్భంగా ఉత్సాహవంతులైన జర్నలిస్టులు
ఇందులో పాల్గొనవచ్చునన్నారు. ఫ్రింట్, అండ్ ఎలక్ర్టానిక్ మీడియా,డెస్క్
జర్నలిస్టులు, ఫోటో, వీడియో జర్నలిస్టులు, వెబ్ ,మహిళా జర్నలిస్టులకు ఆయా
పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తామన్నారు. అయితే జర్నలిస్టులకు సంబంధించిన
అక్రిడేషన్ కార్డు విధిగా ఉండాలన్నారు. లేని పక్షంలో సంస్థ గుర్తింపు కార్డు
కలిగి ఉండాలన్నారు. జర్నలిస్టుల క్రీడలను విజయవంతం చేసేందుకు అందరూ సంపూర్ణంగా
సహకరించాలని వీరు కోరారు. ఈ కార్యక్రమంలో సీఎం అర్ మాడ, వీజెఎఫ్ కోశాధికారి
పిఎన్ మూర్తి, కార్యవర్గ సభ్యులు ఇరోతి ఈశ్వరరావు, పి.వరలక్ష్మి, ఎమ్ ఎస్ ఆర్
ప్రసాద్, డి.గిరిబాబు, పైల దివాకర్, గయాజ్, డేవిడ్, శేఖర్ మంత్రి, మాధవరావు
తదితరులు పాల్గొన్నారు.