కొవ్వూరు : గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 64వ రోజు తాళ్లపూడి
మండలం వేగేశ్వరపురం గ్రామంలో హోం మంత్రి తానేటి వనిత పర్యటించారు. ఈ సందర్భంగా
గ్రామంలోని మహిళలు హారతులిచ్చి హోం మంత్రి కి ఘన స్వాగతం పలికారు. గ్రామ
సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో
కలిసి ఇంటింటికి తిరిగారు. ఈ మూడు సంవత్సరాల కాలంలో సీఎం జగన్ అందిస్తున్న
సంక్షేమ పథకాలు సరిగ్గా అందుతున్నాయా లేదా అని హోంమంత్రి స్వయంగా అడిగి
తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ తమ అర్హతను గుర్తించి పూర్తి పారదర్శకంగా
సంక్షేమ పథకాలు అందిస్తున్నారని లబ్ధిదారులు స్పష్టంచేశారు. తమకు ఎలాంటి కష్టం
కలగకుండా ఒకటో తేదీ నాడు ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తున్న ఘనత సీఎం జగన్ కే
దక్కుతుందని వృద్ధులు, వికలాంగులు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ప్రజలకు
సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను హోంమంత్రి తానేటి వనిత
ఆదేశించారు.
సమస్యలను వెంటనే పరిష్కరించాలి : మంగళవారం కొవ్వూరు మున్సిపల్ ఆఫీస్ లో జరిగిన
సర్వసభ్య సమావేశానికి హోంమంత్రి తానేటి వనిత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో
జిల్లా కలెక్టర్ మాధవిలత, జాయింట్ కలెక్టర్, శ్రీధర్, ఆర్డీవో మల్లిబాబు,
జడ్పీ వైస్ చైర్మన్ పోసిన శ్రీలేఖ, మున్సిపల్ చైర్మన్ భావన రత్నకుమారి, అన్ని
శాఖల అధికారులు, ఇతర వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. కొవ్వూరు
నియోజకవర్గానికి సంబంధించిన వివిధ అంశాలపై సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది.
నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ లో ఉన్న పనులు,
స్థానిక సమస్యలపై సమావేశంలో చర్చించారు. ప్రజల నుండి వస్తున్న సమస్యలను వెంటనే
పరిష్కరించాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండటంతో
పాటు, ఇతర శాఖలను సమన్వయం చేసుకొకుని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని
అధికారులకు హోం మినిస్టర్ తానేటి వనిత సూచించారు.