కృష్ణదాస్ అభ్యర్ధనతో పలు పనులకు నిధులు మంజూరు
నరసన్నపేట : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి బుధవారం నరసన్నపేట పర్యటనలో
భాగంగా జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పత్రాల పంపిణీ సందర్భంగా నిర్వహించిన
బహిరంగ సభలో వరాల జల్లు కురిపించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో
జరిగిన ఈ బహిరంగ సభలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మొదట మాట్లాడుతూ
నరసన్నపేట నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన పనులు, వాటికి నిధుల మంజూరు విషయంపై
సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని అభ్యర్ధించారు. వీటిపై సీఎం తన ముఖ్య ప్రసంగంలో
ప్రస్తావిస్తూ పలు పనులకు విస్తృతంగా నిధులు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు.
నరసన్నపేట పట్టణ పరిధిలో ఆర్ అండ్ బి రోడ్డుని విస్తరిస్తూ సెంటర్ లైటింగ్
ఏర్పాటు కోసం రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నామని అన్నారు. 4000 ఎకరాల
ఆయకట్టుకు నీరు అందించే విధంగా మడపాం ఎత్తిపోతల పథకానికి రూ15 కోట్ల నిధులు
మంజూరు చేస్తున్నామని తెలిపారు. సారవకోట మండలం బొంతు ఎత్తిపోతల పథకం మిగిలిన
పనులను పూర్తి చేయడానికి రూ.40 కోట్లని మంజూరు చేస్తున్నామన్నారు. నరసన్నపేట
పట్టణంలోని రాజులచెరువు అభివృద్ధికి రూ5 కోట్ల రూపాయలు మంజూరు
చేస్తున్నామన్నారు. గ్రుప్పిడిపేట వద్ద సముద్రపు నీరు గ్రామాల్లోకి,
పంటపొలాల్లోకి చేరకుండా ఆటోమెటిక్ ఫాలింగ్ షట్టర్లని ఏర్పాటుకు కోటి రూపాయల
నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. డిఎల్ పురం వద్ద వంశధార కాలువపై
లోలెవల్ కాజ్వే నిర్మాణం కోసం కోటి రూపాయలు మంజూరు చేస్తామన్నారు. నరసన్నపేట
నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వరాల
జల్లు కురిపించడంపై సభకు వచ్చిన విశేష ప్రజానీకం తమ హర్షం వ్యక్తం
చేస్తున్నారు.