రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్య నారాయణ
ఉత్సాహంగా పాలిటెక్ ఫెస్ట్-2022 ప్రారంభం
వినూత్న ఆవిష్కరణలతో విద్యార్ధులు సిద్ధం
విజయవాడ : పాలిటెక్నిక్ విద్యార్ధులు ఆధునిక సాంకేతిక అంశాల పట్ల దృష్టి
సారించి విభిన్న ప్రయోగాత్మక ప్రాజెక్టులను ఆవిష్కరించటం అభినందనీయమని రాష్ట్ర
విద్యాశాఖ మంత్రి బొత్సా సత్యన్నారాయణ అన్నారు. విజయవాడ ఎస్ ఎస్ కన్వేన్షన్
వేదికగా నిర్వహిస్తున్న మూడు రోజల పాలీ టెక్ ఫెస్ట్ 2022-23ను గురువారం మంత్రి
ప్రారంభించారు. బ్లూ టూత్ టెక్నాలజీ ద్వారా వినూత్న రీతిలో జ్యోతీ ప్రజ్వలన
నిర్వహించారు. ఈ సందర్భంగా బొత్స సత్య నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం
విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందన్నారు.
నవరత్నాల పథకం వల్ల విద్యార్థులు ఆటంకాలు లేకుండా తమ విద్యను కొనసాగించటమే
కాక, త్వరిత గతిన ఉపాధి అవకాశాలు పొందగలుగుతున్నారన్నారు. పాలిటెక్నికల్
విద్యార్థుల నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరిచేలా సాంకేతిక విద్యా శాఖ
టెక్‌ఫెస్ట్ నిర్వహించటం అభినందనీయమన్నారు.
ఏపీ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది
విష్ణు మాట్లాడుతూ అంతర్జాతీయ పోటీకి అనుగుణంగా నేటి యువత నూతన సాంకేతికతను
అభ్యసించాలన్నారు. సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి మాట్లాడుతూ
ఈ కార్యక్రమం విద్యార్థులు తమ సాంకేతిక నైపుణ్యాలను, శాస్త్రీయ కోణాన్ని
ప్రదర్శించేందుకు వీలు కల్పించిందన్నారు. కళాశాల స్ధాయిలో జరిగే ఈ తరహా
కార్యక్రమాలు భవిష్యత్తులో ఉన్నత స్దాయి సాంకేతిక ఆవిష్కరణలకు మార్గం
చూపుతాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13చోట్ల రీజనల్ టెక్ ఫెస్ట్ లలో 1000కి
పైగా ప్రాజెక్ట్‌లను ప్రదర్శించడం జరిగిందన్నారు. ఉపాధి, శిక్షణ శాఖ
సంచాలకురాలు లావణ్య వేణి మాట్లాడుతూ పోటీ ప్రపంచాన్ని జయించాలంటే నిరంతర
అభ్యాసం తప్పనిసరన్నారు.
సాంకేతిక విద్యాశాఖ సంయిక్త సంచాలకులు పద్మారావు, కార్యదర్శి విజయ భాస్కర్,
కాకినాడ ప్రాంతీయ సంచాలకులు సత్యన్నారాయణ మూర్తి, తిరుపతి ప్రాంతీయ
సంచాలకురాలు నిర్మల్ కుమార్ ప్రియ, విజయవాడ మున్సిపల్ కార్పొరేటర్ రహనా నహిద్,
కో-ఆప్షన్ మెంబర్ సయ్యద్ అలీం, ఇతర అధికారులు, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు
పాలిటెక్నిక్‌ల ప్రిన్సిపాళ్లు, విద్యార్థులు పాల్గొన్నారు. కూచిపూడి
సిద్ధేంద్రయోగి కళాపీఠం విద్యార్థులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్య
కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. జరిగాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు
చేస్తున్న నవరత్నాల థీమ్‌ను అందంగా ప్రదర్శించారు.