ఫిఫా వరల్డ్‌కప్ లో సంచలనాల మీద సంచలనాలు నమోదవుతున్నాయి. నాలుగుసార్లు
చాంపియన్ షిప్ సాధించిన జర్మనీని జపాన్ దిమ్మదిరిగే దెబ్బ కొట్టింది.
గ్రూప్-ఈలో బుధవారం జరిగిన మ్యాచ్ లో జర్మనీ 1-2తో జపాన్ చేతిలో కంగుతింది.
11వ ర్యాంకర్ జర్మనీతో పోల్చితే 24వ ర్యాంకర్ జపాన్ పసికూనే. మెగా కప్
రికార్డులు కూడా ఏమంత గొప్పగా లేవు. కానీ, గోల్‌తో వెనుకబడినా.. ‘సమురాయ్’
స్ఫూర్తితో పోరాడిన జపాన్.. లేటు గోల్స్‌తో జెయింట్ కిల్లర్‌గా ప్రకంపనలు
సృష్టించింది. ఈ మ్యాచ్ లో జపాన్ తరపున గోల్స్ చేసిన రిట్సు డోయన్, టకుమా
అసానోలిద్దరూ జర్మనీ క్లబ్‌ల తరఫున ఆడుతుండడం విశేషం. గత వరల్డ్ కప్‌ను
ఓటమితో ఆరంభించిన జర్మనీ.. ఈసారి కూడా తొలిమ్యాచ్ లోనే ఓడింది. 33వ నిమిషంలో
లభించిన పెనాల్టీ కిక్‌ను గుండొగాన గోల్‌గా మలచగా.. జపాన్ సబ్‌స్టిట్యూట్
ఆటగాళ్లు డోయన (75వ), టకుమా (83వ) గోల్స్ సాధించారు. ప్రత్యర్థి కీపర్
షుయ్చి గోండా అప్రమత్తతతో.. జర్మనీకి నిరాశ తప్పలేదు. కానీ, 31వ నిమిషంలో
జపాన్ పెనాల్టీ ఏరియాలో గుండొగానను షుచి అభ్యంతరకరంగా అడ్డుకోవడంతో.. రెఫరీ
పెనాల్టీ ఇచ్చాడు. దీన్ని గుండొగాన గోల్‌గా మలచడంతో జర్మనీ 1-0 ఆధిక్యంలో
నిలిచింది.