ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం చంద్రబాబు నైజం
నారా లోకేష్ నోరు.. అదుపులో పెట్టుకో
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ : పేదల లోగిళ్లలో నవరత్నాల పథకాలు కుల, మత, వర్గ భేదాలు లేకుండా
సంక్షేమ వెలుగులు నింపాయని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, విజయవాడ సెంట్రల్
ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గురువారం 59 వ డివిజన్ 243 వ వార్డు
సచివాలయ పరిధి అజిత్ సింగ్ నగర్లో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో
స్థానిక కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానాతో కలిసి ఆయన పాల్గొన్నారు. తొలుత
బాబా సాహెబ్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన
నివాళులర్పించారు. అనంతరం 351 గడపలను సందర్శించి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి
పనులపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సంతకం
చేసిన కరపత్రాలను అందజేశారు. ఎటువంటి అవినీతికి తావు లేకుండా తమకు సంక్షేమ
ఫలాలు అందుతున్నాయని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధుల వద్ద పలువురు లబ్ధిదారులు
సంతోషం వ్యక్తం చేశారు. గత మూడేళ్లలో సచివాలయ పరిధిలో రూ. 8.69 కోట్ల
సంక్షేమాన్ని అందజేసినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. 497 మందికి జగనన్న
ఇంటి పట్టాలు మంజూరు చేసినట్లు వివరించారు.
ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం చంద్రబాబు నైజం : రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్
రెడ్డి తీసుకొస్తున్న సంస్కరణలు అద్భుతమని ప్రతిపక్ష నేత పలుమార్లు చెప్పకనే
చెప్పారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. వాలంటీర్ల
వ్యవస్థను తానే తీసుకొచ్చానని గొప్పలు చెప్పుకుంటూనే మరోవైపు విమర్శలు
గుప్పిస్తూ చంద్రబాబు రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. అలాగే
రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని పైకి దొంగ ఏడుపులు ఏడుస్తూ ఇంకోవైపు అధికారంలోకి
వస్తే రెట్టింపు సంక్షేమం అందిస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. ఏ
ఎండకు ఆ గొడుగు పట్టడం చంద్రబాబుకి నైజంగా మారిపోయిందన్నారు. అదే సంక్షేమాన్ని
అధికారంలో ఉన్న గత ఐదేళ్లు ఎందుకు అమలు చేయలేకపోయారో సమాధానం చెప్పాలని
డిమాండ్ చేశారు. ఆనాడు పేదల సంక్షేమాన్ని, మధ్య తరగతి ప్రజల చేయూతను పూర్తిగా
విస్మరించి ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని మల్లాది విష్ణు
పేర్కొన్నారు. నేడు ప్రధాన ప్రతిపక్ష నేతగానూ ఘోరంగా విఫలమవుతున్నారని
విమర్శించారు. ఎక్కడికి వెళ్లినా ప్రభుత్వాన్ని అర్థరహితంగా విమర్శించడం తప్ప
నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నారని తెలిపారు.
నారా లోకేష్ నోరు అదుపులో పెట్టుకో : 151 అసెంబ్లీ స్థానాలతో తిరుగులేని
మెజార్టీతో అధికారంలోకి వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే
నైతిక అర్హత దొడ్డిదారిన ఎమ్మెల్సీ, మంత్రి అయిన లోకేష్ కి లేదని మల్లాది
విష్ణు అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దమ్మున్న నేత అని, చంద్రబాబులా
వేరొకరి పార్టీ గుర్తుని లాక్కోలేదని చెప్పారు. ఆనాడు అధికారంలో ఉన్న జాతీయ
పార్టీని ఎదిరించి నిలబడి నారాలోకేష్ సహా చంద్రబాబు వందిమాగదులందరినీ
ఒంటిచేత్తో ఓడించారన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా వెన్నుపోటులు, కుట్ర
కోణాలేనని, ఎన్టీఆర్ ఆఖరి మాటలే ఇందుకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో జోనల్
కమిషనర్ అంబేద్కర్, డీఈ రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, సిడిఓ జగదీశ్వరి,
నాయకులు హఫీజుల్లా, దేవిరెడ్డి రమేష్ రెడ్డి, నందెపు సురేష్, నేరెళ్ల శివ,
దినేష్ రెడ్డి, చింతా శ్రీను, పి.వేణు, సాంబశివరావు, కొండా లక్ష్మి,
శాంతకుమారి, అమిత్, గల్లెపోగు రాజు, చింతా మోహన్, ఈశ్వర్, బాబా, మున్షీ, మేడా
శ్రీను, కొండలరావు, తమ్మిశెట్టి రాజా, చిన్నారావు, మార్బుల్ నాగేశ్వరరావు,
నందెపు కిరణ్, జయలక్ష్మి, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు, అభిమానులు
పాల్గొన్నారు.