గుంటూరు : జనవరి 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపట్టబోతున్నానని
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అధికారికంగా ప్రకటించారు.
మంగళగిరి పర్యటనలో ఉన్న ఆయన టీడీపీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.
400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు.
మంగళగిరి నియోజకవర్గంలోని నూతక్కి గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమం
సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. మంగళగిరి నియోజకర్గంలో తన
పాదయాత్ర నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని లోకేశ్ చెప్పారు. పాదయాత్ర
నేపథ్యంలో ఏడాది పాటు నియోజకవర్గానికి తాను దూరంగా ఉంటానని తెలిపారు.