విజయవాడ : భూ సర్వే చారిత్రాత్మక నిర్ణయమని మంత్రి పెద్దిరెడ్డి
రామచంద్రారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గొప్ప మనసుతో
భూ సర్వేకి శ్రీకారం చుట్టారని చెప్పారు. దేశంలో ఇది ఒక ఆదర్శమైన నిర్ణయమని
పేర్కొన్నారు. వందేళ్ల క్రితం భూ సర్వే జరిగింది. 14 సంవత్సరాలపాటు అధికారంలో
ఉన్న చంద్రబాబు ఏనాడు భూ సర్వే నిర్వహించలేదని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు,
కొన్నిమీడియా సంస్థలు కలిసి ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు ఎన్ని కలలు కన్నా మళ్లీ సీఎం కావడం జరగదన్నారు. 2024 ఎన్నికల్లో
తిరిగి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
తెలిపారు.