హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్-4 పోస్టుల భర్తీకి అనుమతి లభించింది. 9,168
పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్టు మంత్రి
హరీశ్‌రావు తెలిపారు. టీఎస్పీఎస్సీ ద్వారా గ్రూప్-4 పోస్టులను భర్తీ
చేయనున్నారు. గ్రూప్ 4 ఉద్యోగాల్లో నాలుగు కేటగిరీ పోస్టులున్నాయి. 429
జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, 6,859 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 18 జూనియర్
ఆడిటర్ పోస్టులు, 1,862 వార్డు ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి
ఇచ్చింది. ఆర్థికశాఖలో 191, పురపాలకశాఖలో 238 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు
ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు,వ్యవసాయశాఖలో 44, బీసీ సంక్షేమశాఖలో
307, పౌరసరఫరాల శాఖలో 72 ఉన్నాయి. అటవీశాఖలో 23, ఆర్థికశాఖలో 46, వైద్య-
ఆరోగ్యశాఖలో 338, ఉన్నత విద్యాశాఖలో 742 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి
అనుమతి ఇచ్చింది. హోంశాఖలో 133, నీటిపారుదల శాఖలో 51, కార్మికశాఖలో 128,
మైనార్టీ సంక్షేమశాఖలో 191 జూనియర్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. పురపాలక శాఖలో
601, పంచాయతీరాజ్ శాఖలో 1,245, రెవెన్యూశాఖలో 2,077, ఎస్సీ అభివృద్ధి శాఖలో
474 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అనుమతి ఇచ్చారు. సెకండరీ విద్యాశాఖలో 97,
రవాణాశాఖలో 20, గిరిజన సంక్షేమ శాఖలో 221, మహిళా, శిశు సంక్షేమ శాఖలో 18,
యువజన సర్వీసుల శాఖలో 13 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ప్రభుత్వం
అనుమతిచ్చింది.