ఎనిమిదేళ్ల కాలంలో 195 శాతం పెరిగిన పంటల ఉత్పత్తి
రైతు ఆదాయం ఐదేళ్లలో డబుల్ చేస్తామన్న ప్రధాని నరేంద్ర మోడీ, అది చేయకుండా
రైతు ఖర్చులు మాత్రం రెట్టింపు చేశారు
విదేశాల్లోని నల్ల డబ్బు వెలికి తీసి ప్రతి ఒక్కరి బ్యాంకు అకౌంట్ లో రూ. 15
లక్షలు వేస్తామన్న డబ్బులు ఎక్కడ నరేంద్ర మోడీ..?
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సూటి ప్రశ్
సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్షతో ధాన్యాగారంగా మారిన రాష్ట్రం
నేడు ఒక కోటి 35 లక్షల 60 వేల ఎకరాలకు పెరిగిన పంటల విస్తీర్ణం
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వెల్లడి
హైదరాబాద్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు
పాల్పడుతోందని, ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో
రైతుల ఆదాయాన్ని ఐదేళ్లలో డబుల్ చేస్తామని చెప్పారని, ఇప్పటికి ఎనిమిది
సంవత్సరాలు గడుస్తున్నా మోడీ హామీ నెరవేరనేలేదని వినోద్ కుమార్ అన్నారు.
శుక్రవారం చొప్పదండి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా చొక్కా రెడ్డి సహా
పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా
పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ
హయాంలో రైతుల ఆదాయం డబుల్ సంగతి ఏమోగానీ రైతుల ఖర్చులు మాత్రం రెట్టింపు
అయ్యాయని, రైతుల కష్టాలు డబుల్ అయ్యాయని అన్నారు. వరి ధాన్యం కొనుగోలు మద్దతు
ధర ఏమాత్రం పెరగలేదని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో దేశం
తిరోగమనంలో పయనిస్తోందని ఆయన అన్నారు. విదేశాల్లో దాచుకున్న నల్ల డబ్బులు
వెలికి తీసి దేశంలోని ప్రతి పౌరుని బ్యాంక్ అకౌంట్ లో రూ. 15 లక్షల వేస్తామని
ప్రధాని నరేంద్ర మోడీ చెప్పి మాట తప్పారని, నయా పైసా కూడా బ్యాంక్ అకౌంట్ లో
పడలేదని వినోద్ కుమార్ పేర్కొన్నారు. దేశ ప్రజల సొమ్మును దోచుకున్న దొంగలకు
నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ఆ దొంగలు విదేశాల్లో తల
దాచుకునేందుకు సహకారాన్ని అందిస్తోందని వినోద్ కుమార్ అన్నారు.
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉత్పత్తి ప్రారంభమైన సంవత్సరం తర్వాత దాన్ని జాతికి
అంకితం చేస్తున్నామన్న సాకుతో ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయాలు చేశారని వినోద్
కుమార్ విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆకుంటిత
దీక్షతో తెలంగాణ రాష్ట్రం ధాన్యాగారంగా మారిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్
చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. గత ఎనిమిదేళ్ల కాలంలో రాష్ట్రంలో
పంటల ఉత్పత్తి 195 శాతం పెరిగిందని, ఇది దేశ చరిత్రలోనే లిఖించదగ్గ అంశమని
అన్నారు. 2014 – 15 సంవత్సరంలో రాష్ట్రంలో కేవలం 68.17 లక్షల ఎకరాల్లో మాత్రమే
పంటల సాగు ఉండగా, ప్రస్తుతం ఒక కోటి 35 లక్షల 60 వేల ఎకరాలకు పంటల విస్తీర్ణం
పెరిగిందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. రైతులకు వ్యవసాయానికి పుష్కలంగా
సాగునీరు, ఉచితంగా విద్యుత్ అందించిన రాష్ట్ర ప్రభుత్వ కృషివల్లే ఈ ఘనత
సాధ్యమైందని వినోద్ కుమార్ తెలిపారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా
అండగా నిలుస్తోందని, దీంతో రాష్ట్రంలో రైతులు సంతోషంతో ఉన్నారని వినోద్ కుమార్
అన్నారు.
గత నాలుగు నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో 65 లక్షల మంది రైతులకు రైతుబంధు పథకం
కింద ఆర్థిక సాయం అందించామని, రైతుబంధు కింద రాష్ట్రంలో రూ. 57 వేల 901 కోట్ల
ఆర్థిక సాయం అందించామని వినోద్ కుమార్ వివరించారు. రైతులకు కానీ, వ్యవసాయంపై
ఆధారపడిన సంబంధిత వ్యక్తులకు గాని ఏదైనా ప్రమాదం జరిగితే.. వారి కుటుంబానికి
ఆర్థికంగా అండగా నిలిచేందుకు రైతు బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు
చేస్తోందని, రైతు బీమా కింద 88,620 మంది రైతు కుటుంబాలకు రూ. 4,431 కోట్ల
క్లైమ్స్ పంపిణీ చేసినట్లు వినోద్ కుమార్ పేర్కొన్నారు. గులాబీ జెండా
నాయకత్వంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కార్య దక్షతతో రాష్ట్రం అభివృద్ధి పథంలో
పయనిస్తుందని వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపిలకు స్థానం
లేదని ఈ మేరకు ప్రజలు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారని వినోద్ కుమార్ అన్నారు.ఈ
కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రవిశంకర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ విజయ మాజీ
ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు
పాల్గొన్నారు.