అమెరికా : కాల్పుల వంటి తీవ్రమైన ఘటనలకు ప్రయత్నించే నేరగాళ్లను చంపే రోబో
పోలీసులను ఉపయోగించాలని అమెరికా పోలీసులు యోచిస్తున్నారు. అగ్రరాజ్యం
అమెరికాలో తుపాకీ సంస్కృతి పేట్రేగిపోతోంది. ఎక్కడ చూసినా విచ్చలవిడిగా
కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న వర్జీనియాలోని ఓ
వాల్మార్ట్ స్టోర్లో ఓ మేనేజర్ జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు
కోల్పోయిన విషయం తెలిసిందే. ఇలాంటి దారుణాలను అరికట్టేందుకు శాన్ఫ్రాన్సిస్కో
పోలీసులు సరికొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. కాల్పుల వంటి తీవ్రమైన ఘటనలకు
ప్రయత్నించే నేరగాళ్లను చంపే రోబో పోలీసులను ఉపయోగించాలని యోచిస్తున్నారు. ఈ
మేరకు ముసాయిదా ప్రణాళికను రూపొందించారు. శాన్ఫ్రాన్సిస్కో పోలీసు విభాగంలో
ప్రస్తుతం 17 రోబోలు ఉన్నాయి. అయితే ఇందులో 12 నిర్వహణలో లేవు. మిగతా వాటిని
బాంబు తనిఖీలు, నిర్వీర్యానికి ఉపయోగిస్తున్నారు. అయితే తీవ్రమైన నేర
ఘటనల్లోనూ వీటిని వినియోగించాలని అక్కడి పోలీసులు భావిస్తున్నారు. ఇందులో
భాగంగానే కాల్పుల వంటి ఘటనలను తిప్పికొట్టే క్రమంలో నేరగాళ్లను చంపేసేలా రోబోల
సామర్థ్యాన్ని పెంచాలని యోచిస్తున్నారు. మెషిన్లు, గ్రనేడ్ లాంఛర్లతో రోబోలను
మార్చాలని డ్రాఫ్ట్ డాక్యుమెంట్లో పేర్కొన్నారు. ఈ ముసాయిదా ప్రణాళికపై
వచ్చేవారం జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
కాగా ఇప్పటికే పలు దేశాల్లో పోలీసు విభాగాల్లో రోబోలు విధులు నిర్వర్తిస్తున్న
విషయం తెలిసిందే.