శ్రీకాకుళం : రాష్ట్ర వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌ॥
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నిర్ణయానుసారం జిల్లా అధ్యక్షులు
సరన్నపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాసు సూచనలమేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో
భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర కళింగవైశ్య,
భేరివైశ్య సంక్షేమ సంఘం ఛైర్మన్ అంధవరపు సూరిబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్
ఎమ్.వి. పద్మావతి, జిల్లా వర్కింగ్ కమిటి ప్రెసిడెంట్ శిమ్మ రాజశేఖర్,
వై.యస్.ఆర్. పార్టీ నాయకులు అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమములో రాష్ట్ర కళింగవైశ్య, భేరివైశ్య సంక్షేమ సంఘం ఛైర్మన్
మాట్లాడుతూ భారతదేశ చరిత్రలోనే నవంబరు 26, జనవరి 26 భారతీయులందరూ
గుర్తుపెట్టుకోవలసిన ప్రముఖమైన రోజని, 200 సంవత్సరాలపాటు బ్రిటిష్వారి బానిస
పాలనలో మగ్గిన మన దేశానికి ఆగష్టు 15, 1947 న స్వాతంత్య్రం సిద్ధించినా మన
దేశాన్ని మనమే పరిపాలించుకొనే లక్ష్యంతో ఎంతోమంది మేథావులు ఎన్నో దేశాల
రాజ్యాంగాలను పరిశీలించి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అవిశ్రాంతిగా శ్రమించి
ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని తయారుచేసారని, డా॥ బి.ఆర్.
అంబేడ్కర్ అధ్యక్షతన 6 గురు ముసాయిదా కమిటీ సభ్యులు కె.ఎమ్. మునీ, మహ్మద్
షాదుల్లా, అల్లాడి క్రిష్ణస్వామి అయ్యర్, గోపాలస్వామి అయ్యంగార్, ఎన్.
మాధవరావు, టి.టి. క్రిష్ణమాచారి వారు అనేక సంస్కృతులు, మతాలు, భాషలతోపాటు,
బడుగు, బలహీనవర్గాల సంక్షేమమే లక్ష్యంగా భారత రాజ్యాంగం రూపొందించారని
పేర్కొన్నారు.
1950, జనవరి 26 నుండి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందని ఆ రోజు నుండి
భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా
అవతరించిందని ప్రతి భారతీయుడు దేశ రాజ్యాంగం గూర్చి పరిపూర్ణ అవగాహన
కలిగివుండాలని, ప్రతి ఒక్కరూ తన భాద్యతలను నిర్వహిస్తూ రాజ్యాంగ బద్ధంగా
హక్కులను పొందుతూ దేశాన్ని గౌరవిస్తూ, దేశ ఔన్నత్యాన్ని తెలియజేసే ఇటువంటి
కార్యక్రమాలలో పాల్గొనాలని, వ్యక్తి కంటే తల్లి గొప్పదని, తల్లి కంటే సంస్థ
గొప్పదని, సంస్థ కంటే సమాజం గొప్పదని, సమాజం కంటే దేశం గొప్పదని కావున ప్రతి
ఒక్కరూ దేశ గౌరవాన్ని పెంపొందించే భాద్యతాయుత భారతీయ పౌరుడిగా మెలగాలని,
కొన్ని దేశాలు రాజ్యాంగ పరిరక్షణలో విఫలమైనా భారతదేశం రాజ్యాంగ పరిరక్షణలో
అత్యున్నత స్థానంలో వుండటానికి కారణం స్వాతంత్య్ర సమరయోధుల త్యాగం, స్ఫూర్తి
అని తెలియజేసారు. మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ ఎమ్.వి. పద్మావతి మాట్లాడుతూ
పార్టీ క్యాలండరు ప్రకారం ఇటువంటి కార్యక్రమాలు జరగడం నేటి తరానికి త్యాగధనుల
చరిత్ర చెప్పడం ఎంతో ఆనందదాయకమని తెలియజేసారు. ఈ కార్యక్రమములో జిల్లా పార్టీ
నాయకులు సాధు వైకుంఠరావు, పొన్నాడు రుషి, ఎన్ని ధనుంజయ, ముంజేటి కృష్ణమూర్తి,
కింతలి రమేష్, ఎమ్.ఏ బేగ్, భాస్కరరావు, చక్రవర్తి, గురువులు, కామేశ్వరి, సనపల
నారాయణరావు, మైలపిల్లి మహాలక్ష్మి, పడపాన సుగుణ, కింజరాపు రమేష్, శంకరరావు,
నల్లబారికి శ్రీనివాస్, సీపాన రామారావు, ఎ. రమేష్, తదితర పార్టీ నాయకులు
పాల్గొన్నారు.