సాకర్ ఫిఫా ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ఆతిథ్య ఖతార్ జట్టు
నిలిచింది. శుక్రవారం నెదర్లాండ్స్- ఈక్వెడార్ జట్ల మధ్య జరిగిన గ్రూప్ ‘ఎ’
పోరు డ్రా కావడంతో ఆతిథ్య జట్టు మరో మ్యాచ్ ఉండగానే ఇంటిదారి పట్టింది.
అంతకుముందు సెనెగల్‌తో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో ఖతార్ 1-3తో ఓడింది.
ఖతార్కిది వరుసగా రెండో పరాజయం. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఈక్వెడార్ చేతిలో
0-2తో ఖతార్ ఓడింది. నాలుగు జట్ల గ్రూపులో నెదర్లాండ్స్, ఈక్వెడార్ చెరో
నాలుగేసి పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. సెనెగల్ (3) మూడో
స్థానంలో ఉండగా, ఖతార్ (0) అట్టడుగు స్థానంలో నిలిచింది.