కురియన్ ఆశయం మేరకే పాడి రైతుల సంక్షేమం కోసం కృషి
కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు
విజయవాడ : శ్వేత విప్లవ పితామహ డాక్టర్ వర్హీస్ కురియన్ 101 వ
జయంతి వేడుకలను కృష్ణా మిల్క్ యూనియన్ ఫ్యాక్టరీ ఆవరణ లో శనివారం ఘనంగా
నిర్వహించారు. ఈ సందర్భముగా సమితి ఆవరణ లో గల కురియన్ కాంస్య విగ్రహానికి
పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భముగా చైర్మన్ చలసాని ఆంజనేయులు
మాట్లాడుతూ కురియన్ ఆదర్శ సూత్రాలను తుచా తప్పకుండా పాటిస్తున్న సహకార సంస్థ
కృష్ణా మిల్క్ యూనియన్ అని తెలిపారు. దేశం లోనే అత్యధిక పాల సేకరణ ధర
చెల్లించటమే కాకుండా గత పది సంవత్సరములు గా క్రమం తప్పకుండా ధర వత్యాసము
చెల్లిస్తూ పాడి రైతుల సర్వతోముఖాభివృద్ధికి కృష్ణా మిల్క్ యూనియన్ ఎనలేని
కృషి చేస్తుందని తెలిపారు. అంతే కాకుండా కురియన్ నిర్దేశాలకు అనుగుణముగా
వినియోగదారుడి దగ్గర తీసుకున్న ప్రతి రూపాయి లో నేరుగా 80% కి పైబడి తిరిగి
రైతులకు చెల్లిస్తున్న ఏకైక సహకార సంస్థ కృష్ణా మిల్క్ యూనియన్ అని తెలిపారు.
పాడి రైతుల సంక్షేమం, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడమే కృష్ణా
మిల్క్ యూనియన్ లక్ష్యమని తెలిపారు.
ఈ సందర్భముగా సమితి సిబ్బందిని ఉద్దేశించి ఛైర్మన్ మాట్లాడుతూ కురియన్
స్పూర్తితో ప్రతి ఒక్కరు యూనియన్ అభివృద్ధికి తద్వారా లక్షా యాబై వేల పాడి
రైతుల అభివృద్ధికి మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భముగా 2021-22
సంవత్సరానికి సమితికి అత్యధికముగా పాలు సరఫరా చేసిన పాల ఉత్పత్తిదారుడు పి.
దానియేలు (కె. వి. కండ్రిక) ని, సమితి కి అత్యధిక పాలు సరఫరా చేసిన సంఘములలో
మూడవ స్థానము లో ఉన్న కె. వి. కండ్రిక సంఘ అధ్యక్షులు డి.మంగా రెడ్డి కి
బహుమతులు ప్రదానం చేసి, సదరు సంఘ పాలకవర్గ
సభ్యులను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పాలక వర్గ సభ్యులు శ్రీమతి ఎర్నేని సీతా దేవి , దాసరి
బాలవర్ధన రావు, అర్జా వెంకట నగేష్ , చలసాని చక్రపాణి , వేమూరి సాయి వెంకట
రమణ, తిరుమల స్వర్ణ కుమారి, పి. కొండలరావు , పి.వి.అర్.వి ప్రసాద్, డి. మహేష్
బాబు, నెలకుదిటి నాగేశ్వరరావు, ట్రస్ట్ సభ్యులు పిన్నమనేని లక్ష్మీ ప్రసాద్
, పి.సత్యనారాయణ, సమితి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.