సీఎం జగన్ మోహన్ రెడ్డితో గిరిధర్ అరమణే భేటీ
రక్షణ శాఖకు సంబంధించిన ప్రాజెక్ట్‌లపై ఇరువురి మధ్య చర్చ
గిరిధర్‌ను రిలీవ్ చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ
వెలగపూడి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా గిరిధర్ అరమణే
పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు గిరిధర్‌ను రిలీవ్ చేయాలని కేంద్రానికి
రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన
కార్యదర్శిగా గిరిధర్ అరమణే పేరు తెరపైకి వచ్చింది. 1988 ఐఏఎస్ బ్యాచ్‌కు
చెందిన ఆయన ప్రస్తుతం రక్షణశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ
మేరకు గిరిధర్‌ను రిలీవ్ చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ
రాసినట్లు సమాచారం. మరోవైపు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో
గిరిధర్ అరమణే శనివారం భేటీ అయ్యారు. కొత్త సీఎస్ నియామకంపై కసరత్తు
జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీ కేడర్
సీనియార్టీ జాబితాలో గిరిధర్ అరమణే రెండో స్థానంలో ఉన్నారు. ఒకవేళ అరమణే
సీఎస్‌గా బాధ్యతలు చేపడితే 2023 జూన్ 30 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. కొత్త
సీఎస్ నియామకంపై ఇవాళ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రధాన
కార్యదర్శి సమీర్‌శర్మ ఈనెల 30న పదవీవిరమణ చేయనున్నారు. డిసెంబరు 1 నుంచి నూతన
ప్రధాన కార్యదర్శి బాధ్యలు చేపట్టాల్సి ఉంటుంది. తొలుత కొత్త సీఎస్‌గా
జవహర్‌రెడ్డిని నియమించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నూతన
సీఎస్‌గా ఎవరిని నియమించాలనే దానిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ
మేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి
గిరిధర్ అరమణె (ఏపీ క్యాడర్ ఐఏఎస్) కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో రక్షణ శాఖకు
సంబంధించిన ప్రాజెక్ట్‌లపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం
తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం మచిలీపట్నంలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
యూనిట్ పరిశీలనకు వెళ్ళిన గిరిధర్. అక్కడ జరిగిన ఎన్సీసీ పునిత్ సాగర్
అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.గిరిధర్‌ను సన్మానించి శ్రీ
వేంకటేశ్వరస్వామి వారి ప్రతిమను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
అందించారు.