హైదరాబాద్ : దానాలలన్నిటిలో ఉత్తమమైనది అవయవదానం. ఈ ఒక్కదానం దాదాపు 8మందికి
పునరుజ్జీవం కల్పిస్తుంది. అందుకే అవయవదాతలను ప్రాణదాతలతో పోలుస్తారు.
ప్రభుత్వం సైతం ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున ప్రజలలోకి తీసుకెళ్లడానికి
శ్రీకారం చుడుతుంది. ఇందులో భాగంగా అవయవదానం చేసిన 162 కుటుంబాలను మంత్రి
హరీశ్ రావు సత్కరించారు. ఆరోగ్య తెలంగాణ అంటే రోగాలు వచ్చాక చికిత్స అందించటం
కాకుండా ప్రజలు అనారోగ్యంపాలు కాకుండా చర్యలు తీసుకోవటమని వైద్యారోగ్య శాఖ
మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. జాతీయ అవయవ దినోత్సవం సందర్భంగా 162
అవయవదాతల కుటుంబాలను హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో హరీశ్ రావు సత్కరించారు.
త్వరలో గాంధీ ఆస్పత్రిలో 35కోట్లతో ప్రత్యేక అవయవమార్పిడి విభాగాన్ని ఏర్పాటు
చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఒక మనిషి చనిపోయినా అతను అతని అవయవాల దానంతో
8మంది ప్రాణాలను నిలపవచ్చని మంత్రి హరీశ్ రావు తెలిపారు. అవయవదానంలో రాష్ట్రం
దేశానికే దిక్సూచిగా మారిందని పేర్కొన్నారు. ఆరోగ్య పరిరక్షణ పేరుతో ఆయుష్
ద్వారా ముందస్తు చర్యలు చేపడతామని చెప్పారు. అవయవ దానం తరహాలో ఆరోగ్య పరిరక్షణ
సైతం దేశానికే దిక్సూచిగా మారతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. అవయవదానంలో చాలా
రాష్ట్రాలు తెలంగాణ విధానాలనే అమలు చేస్తున్నాయని మంత్రి హరీశ్ రావు
వెల్లడించారు.అవయవ మార్పిడి సమయంలో ఎదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే
హెలికాప్టర్ సైతం వినియోగిస్తామని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
సాధారణంగా అవయవాలు బీపీ,షుగర్ వల్లే అధికంగా చెడిపోతాయని.. జీవనశైలి
మార్చుకోవడం వల్ల అవయవాలు ఫెయిల్కావటాన్ని నియంత్రించవచ్చని పేర్కొన్నారు.
యువకులు సైతం వారి కుటుంబాలలో అవయవదానాలపై అవగాహాన కల్పించాలని మంత్రి హరీశ్
రావు విజ్ఞప్తి చేశారు.