అమరావతి : గత రెండు నెలల క్రితం నిశ్చితార్థాన్ని ఎంతో ఘనంగా జరిపించిన ఆలీ
అనంతరం తన కుమార్తె వివాహాన్ని నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిపించారు. ఇక ఈమె
పెళ్లి వేడుకలు ప్రారంభం ఉన్ అయినప్పటి నుంచి తన పెళ్లి వేడుకలకు సంబంధించిన
అన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇకపోతే ఆలీ దంపతులు ఇండస్ట్రీకి
చెందిన పలువురు సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులను కూడా ఆహ్వానించిన సంగతి
తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన కుమార్తె వివాహానికి ఎంతోమంది సినీ రాజకీయ
ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీ మినిస్టర్ రోజాతో పాటు
మెగాస్టార్ చిరంజీవి దంపతులు అలాగే నాగార్జున దంపతులు కూడా హాజరయ్యి నూతన
వధూవరులను ఆశీర్వదించారు.
రేపు సాయంత్రం గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు శ్రీ కన్వెన్షన్ లో ఈ కార్యక్రమం
ఏర్పాటు చేశారు. దీనికి సీఎం జగన్ సహా పలువురు అతిధులు హాజరుకాబోతున్నారు.
వైసీపీకి మద్దతుగా గత ఎన్నికలతో పాటు స్ధానిక సంస్ధల ఎన్నికల్లోనూ ప్రచారం
చేసిన అలీకి సీఎం జగన్ ఏపీ ప్రభుత్వ సలహాదారు (ఎలక్ట్రానిక్ మీడియా)గా
బాధ్యతలు అప్పగించారు. అనంతరం ఆయన విధుల్లో చేరారు. ఈ సందర్భంగా తన కుమార్తె
పెళ్లికి జగనన్న ఇచ్చిన గిఫ్ట్ గా దీన్ని అభివర్ణించారు. తాజాగా హైదరాబాద్ లో
అలీ కుమార్తె వివాహం జరిగింది. దీనికి టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు
హాజరయ్యారు.