గీత కార్మికులు తాటి, ఈత చెట్ల పై పడి శాశ్వత అంగవైకల్యం చెందిన గీత
కార్మికులకు ప్రభుత్వ ఆసుపత్రి లో మెడికల్ బోర్డ్ ముగ్గురు డాక్టర్లు ఇచ్చే
సర్టిఫికెట్లు జారీనీ సులభతరం చేయాలని అబ్కారీ శాఖ అధికారులకు మంత్రి ఆదేశం
గీత కార్మికులకు శాశ్వత అంగవైకల్యం పొందిన సర్టిఫికెట్లు ను ఆర్థోపెడిక్
అసిస్టెంట్ సర్జన్ ఇచ్చేలా నిబంధనలు సవరించాలని చర్యలు తీసుకోవాలని అధికారులకు
ఆదేశం
రైతు బంధు మాదిరిగా సాధారణ మరణం సంభవించిన గీత కార్మికులకు ఎక్స్ గ్రేషియా
ఇచ్చేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని అబ్కారీ శాఖ అధికారులకు
ఆదేశం
నీరా ఉత్పత్తి, సేకరణ పై నీరా చిల్లింగ్ స్టేషన్ లైనా సర్వేల్, చారుకొండ,
మునిపల్లె లలో నిర్మిస్తున్న నీరా చిల్లింగ్ ప్లాంటు నిర్మాణ పనులు శరవేగంగా
పూర్తి చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశం.
హైదరాబాద్ : రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి
శ్రీనివాస్ గౌడ్ గౌడ్ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో నీరా పాలసీ లో భాగంగా
నీరా కేఫ్ ప్రారంభోత్సవం , నీరా ఉత్పత్తి, సేకరణ, మార్కెటింగ్, నీరా
చిల్లింగ్ కేంద్రాల నిర్మాణ పనులపై, తదితర అంశాలపై అబ్కారీ శాఖ కమిషనర్
సర్ఫరాజ్ అహ్మద్ తో కలసి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష
లో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అదేశాల మేరకు
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కి
ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీ ని ప్రవేశపెట్టారన్నారు. హైదరాబాద్ నగరంలో ఎంతో
విలువైన నెక్లస్ రోడ్డు లో సుమారు 20 కోట్ల రూపాయల తో నిర్మించిన నీరా కేఫ్
పనులను పూర్తి అయిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ చే నీరా కేఫ్ ను వచ్చే10 రోజుల్లో
ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి అబ్కారీ శాఖ అధికారులను ఆదేశించారు.
గీత కార్మికులు ప్రమాదవశాత్తూ తాటి, ఈత చెట్ల పై పడి శాశ్వత అంగవైకల్యం చెందిన
సర్టిఫికెట్లు జారీ చేసే అంశాలపై నిబంధనలను సరళతరం చేయాలని మంత్రి అధికారులను
ఆదేశించారు. మెడికల్ బోర్డు స్థానంలో ఆర్థోపెడిక్ అసిస్టెంట్ సర్జన్ ఇచ్చే
సర్టిఫికెట్ ను ఆధారంగా చేసుకొని అబ్కారీ శాఖ గీత కార్మికులకు ఎక్స్ గ్రేషియా
ను ఇవ్వాలని ఆదేశించారు.
రైతు బంధు మాదిరిగా గీత కార్మికులు సాధారణ మరణం సంభవించిన ఎక్స్ గ్రేషియా ను
విడుదల చేసేలా తగిన కార్యాచరణ ను రూపొందించాలని మంత్రి డా. శ్రీనివాస్ గౌడ్
అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష లో నీరా ఉత్పత్తి, సేకరణ పై నీరా చిల్లింగ్
స్టేషన్ లైనా సర్వేల్, చారుకొండ, మునిపల్లె లలో నిర్మిస్తున్న నీరా చిల్లింగ్
ప్లాంటు నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఆదేశించారు. గీత కార్మికులకు మోపెడ్ వాహనాల పంపిణీ పై సీఎం కేసీఆర్ తో
చర్చిస్తామన్నారు. అందుకు అవసరమైన నివేదికను అబ్కారీ శాఖ అధికారులు తయారు
చేయాలని మంత్రి డా. శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. ఈ సమీక్ష లో అబ్కారీ శాఖ
ఉన్నతాధికారులు అజయ్ రావు, డేవిడ్ రవికాంత్, దత్తరాజ్ గౌడ్, చంద్రయ్య,
సత్యనారాయణ, రవీందర్ రావు, అరుణ్ కుమార్, విజయ్ భాస్కర్ గౌడ్, నవీన్ తదితరులు
పాల్గొన్నారు.