హైదరాబాద్ : వైఎస్సార్టీపీ అధినేత్రి వై. ఎస్ షర్మిలకు నాంపల్లి కోర్ట్
బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగతపూచీకత్తుపై బెయిల్ మంజూర్ చేశారు. రిమాండ్
విధించాలని పోలీసులు కోరగా షర్మిల తరపున న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల
వాదనలు విన్న మేజిస్ట్రేట్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై నాంపల్లి
కోర్టులో కీలక వాదనలు జరిగాయి. శాంతిభద్రతల సమస్య వస్తుందనే షర్మిలను
అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. రోడ్డుపై షర్మిల, పార్టీ
కార్యకర్తలతో న్యూసెన్స్ క్రియేట్ అయ్యిందని పోలీసులు వెల్లడించారు. షర్మిలకు
రిమాండ్ విధించకపోతే శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు
పేర్కొన్నారు. షర్మిల న్యాయవాదులు రిమాండ్‌ను వ్యతిరేకించారు. తప్పుడు కేసులు
నమోదు చేశారని, జరిగిన ఘటనకు పెట్టిన కేసులకు సంబంధంలేదని వాదించారు.
ఉద్దేశ్యపూర్వకంగానే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారని పేర్కొన్నారు.
శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళ్తే అరెస్ట్ చేశారని ప్రస్తావించారు.
పోలీసుల విధులకు షర్మిల ఆటంకం కలిగించలేదని పేర్కన్నారు. కాగా వరంగల్ జిల్లా
నర్సంపేట నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు
వైఎస్ షర్మిలపై, తన కాన్వాయ్‌పై టీఆర్ఎస్ శ్రేణులు సోమవారం దాడి చేశారు. ఈ
దాడిని నిరసిస్తూ మంగళవారం ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న వైఎస్ షర్మిలను
పోలీసులు అడ్డుకున్నాడు. పంజాగుట్టలో ఆమె కారును అడ్డుతగిలారు. డోర్ లాక్
చేసుకుని షర్మిల కారు లోపలే ఉన్నారు. దీంతో కొద్దిసేపటి తర్వాత కారును
క్రేన్‌తోనే లిఫ్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కారులో
నలుగురు వ్యక్తులు ఉండగానే లాక్కెళ్లారు. ఆ తర్వాత పీఎస్ బలవంతంగా కారు
డోర్లు తెరిచి షర్మిలను అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి
నాంపల్లి కోర్టుకు తరలించి 14ఏసీ ఎంఎం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన విషయం
తెలిసిందే.