2023 ఫిబ్రవరి 16,17 తేదీలలో వైజాగ్ టెక్ సమ్మిట్ నిర్వహణ
విశాఖపట్నం మరో ప్రపంచస్థాయి సదస్సుకి ఆతిథ్యం ఇవ్వనుంది. ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ అనుసంధానంతో పల్సస్ గ్రూపు సీఈవో డా. గేదెల శ్రీనుబాబు ఆధ్వర్యంలో
వైజాగ్ టెక్ సమ్మిట్ 2023 నిర్వహణకి సన్నాహాలు మొదలయ్యాయి. “వైజాగ్ టెక్
సమ్మిట్ 2023“పేరుతో ఫిబ్రవరి 16, 17తేదీలలో నిర్వహించనున్న సమ్మిట్ కి
గ్లోబల్ కమ్యూనిటీ ఆఫ్ ఇన్నోవేటర్లు, మేధావులు హాజరు కానున్నారు. పల్సస్
గ్రూప్ సీఈవో శ్రీనుబాబు గేదెల ఇప్పటివరకూ 3,000లకు పైగా అంతర్జాతీయ
సదస్సులను విజయవంతంగా నిర్వహించిన అనుభవంతో వైజాగ్ టెక్ సమ్మిట్ బాధ్యతలు
స్వీకరించారు. డిజిటల్, మెడికల్, టెక్ ఈవెంట్లను దిగ్విజయంగా నిర్వహించిన
పల్సస్ నిపుణుల బృందం ఆధ్వర్యంలో పల్సస్ గ్రూపు గ్లోబల్ నెట్వర్క్ ద్వారా
వివిధ దేశాల నుంచి వచ్చిన సంస్థలు-మేధావులు జ్ఞానాన్ని పంచుకోవడానికి, తాజా
అంశాలను చర్చించడానికి, ఫ్యూచర్ టెక్నాలజీని ప్రదర్శించడానికి వైజాగ్ టెక్
సమ్మిట్ 2023 వేదిక కానుంది. వర్చువల్, ఫిజికల్ ఈవెంట్ వేదికల ద్వారా గ్లోబల్
కమ్యూనిటీ ఆఫ్ ఇన్నోవేటర్లు పాల్గొంటారు. ఫిబ్రవరి 16, 17తేదీలలో రెండు
రోజులపాటు 3 సెషన్లలో 25 మంది సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్స్ ప్రసంగిస్తారు.
మనదేశంతోపాటు వివిధ దేశాల నుంచి ఇప్పటికే కంపెనీలు స్థాపించి విజయవంతంగా
నడుపుతున్న ప్రతినిధులు వెయ్యి మందికి పైగా హాజరు కానున్నారు. ఈ సమ్మిట్ టెక్
కంపెనీల వృద్ధిని వేగవంతం చేయడానికి అవసరమైన మార్గాన్ని చూపేందుకు సమర్థవంతమైన
వేదిక కానుంది. వైజాగ్ టెక్ సమ్మిట్‌ని ఉపయోగించుకోవడం ద్వారా భవిష్యత్
టెక్నాలజీకి అనుసంధానం అయ్యే అవకాశం దక్కనుంది. పరిశ్రమ ప్రముఖులు,
తయారీదారులు, కీలక నిర్ణయాధికారులతో ఫేస్ టైమ్ పొందవచ్చు. వినూత్నమైన
సాంకేతికతలను పరిచయం సంస్థల దిశానిర్దేశానికి ఎంతగానో ఉపయోగపడొచ్చని కంపెనీ
ప్రకటించింది. ప్రపంచస్థాయి సంస్థల్ని ఒకే వేదికపైకి తీసుకొస్తున్న వైజాగ్
టెక్ సమ్మిట్ 2023 భారతదేశంలోనే మొట్టమొదటిది కానుంది. సమ్మిట్ నిర్వహణకి
ముందుగా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదేశాలలో ఈవెంట్లు జరుగుతాయి. నవంబర్ 29,
2022న ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇన్వెస్టర్ల రోడ్ షో, స్టార్టప్
మీట్-అప్లు, CEO కాన్‌క్లేవ్‌లతో ప్రారంభం కానుంది. 2023 ఫిబ్రవరి 16, 17
తేదీల్లో విశాఖపట్నంలో మెగా ఈవెంట్ నిర్వహణతో టెక్ సమ్మిట్ ముగియనుంది.
పోస్టర్ ఆవిష్కరణ : వైజాగ్ టెక్ సమ్మిట్ 2023 ఈవెంట్ పోస్టర్‌ను గురువారం
ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జొనాథన్ హీమర్, మినిస్టర్ ఆఫ్
కమర్షియల్ అఫైర్స్, యునైటెడ్ స్టేట్స్ ఎంబసీ, న్యూ ఢిల్లీ, యుఎస్ కాన్సులేట్
ప్రిన్సిపల్ కమర్షియల్ ఆఫీసర్ ఆండ్రూ ఎడ్లెఫ్‌సెన్ హైదరాబాద్ ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి బృందం కిరణ్ కుమార్ రెడ్డి సలికిరెడ్డి,
గ్రూప్ సీఈఓ, జనరల్ మేనేజర్ , సాయి అరవింద్, డాక్టర్ శ్రీనుబాబు గేదెల,
సీఈఓ, పల్సస్ గ్రూప్, వైస్ చైర్మన్ ఆఫ్ ఎక్స్ పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ ఫర్
శ్రీకాంత్ బాడిగ, ఇండో-అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ సి నారాయణరావు,
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ, రాజగోపాల్ చౌదరి, ఛైర్మన్, దేవి ఫిషరీస్ లిమిటెడ్;
సౌరభ్ జైన్, హెడ్ ఏరోస్పేస్ మరియు ఎయిర్పోర్ట్ సిటీ బిజినెస్, ఇంటర్నేషనల్
ఎయిర్పోర్ట్ లిమిటెడ్ మురళీధర్, కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్, గణేష్ సుబుధి,
పార్క్స్ ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జాతీయ అధ్యక్షుడు పూర్ణచంద్రరావు
ఎస్, అనంత్ ఇన్ఫో పార్క్, హైటెక్ సిటీ సీఎండీ సుబ్బారావు పావులూరి
పాల్గొన్నారు.