క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లింపులు
మదనపల్లె (అన్నమయ్య జిల్లా) : జూలై – సెప్టెంబరు 2022 త్రైమాసికానికి 11.02
లక్షల మంది విద్యార్ధులకు రూ.694 కోట్లను అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బటన్
నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో సీఎం వైయస్.జగన్ జమ చేశారు. ఈ
కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జఖియా ఖానం, ఉప ముఖ్యమంత్రి
(ఎక్సైజ్ శాఖ) కె నారాయణస్వామి, విద్యుత్, అటవీ పర్యావరణం, భూగర్భ గనులశాఖ
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ,
వ్యవసాయ, మార్కెటింగ్, సహాకారశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సాంఘిక
సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త గడికోట
శ్రీకాంత్‌రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా
ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.