అందించాలని కలెక్టర్ ని ఆదేశించిన ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వెంటనే స్పందించి రూ. 1,00,000 చెక్కు, నెలవారీ 3000
రూపాయల పింఛను మంజూరు చేసిన కలెక్టర్ గిరీష పి ఎస్
రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్ కు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపిన హమీద
మదనపల్లి : బుధవారం మదనపల్లె టిప్పు సుల్తాన్ గ్రౌండ్స్ నుండి 4వ దశ జగనన్న
విద్యా దీవెన లబ్దిని ప్రారంభించిన సందర్భంగా, వేదిక వద్ద హమీద బిడ్డ మొహమ్మద్
అలికి దీర్ఘకాలిక వ్యాధి ఉన్న విషయం దృష్టికి వచ్చి గౌరవనీయులైన ముఖ్యమంత్రి
గారు తన దయార్ద హృదయాన్ని చూపారు. హమీద అనే మహిళ తన బిడ్డ మహ్మద్ అలీ అనే
చిన్నారిని ఎత్తుకుని బుధవారం టిప్పు సుల్తాన్ గ్రౌండ్స్ నందు బహిరంగ సభకు
తీసుకురావడం జరిగింది. తన బిడ్డ తలకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధితో
బాధపడుతున్నాడని, చికిత్స చేయించడానికి ఆర్ధిక స్థోమత సరిపోక ఇబ్బందులు
పడుతున్నామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. వివరాలు ఆరా తీసిన పిదప
విషయం అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి వెంటనే ఆమెకు ఆర్ధిక పరంగా సహాయం
అందచేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా
కలెక్టర్ గిరీష పి ఎస్ వెంటనే స్పందించి కార్యక్రమ అనంతరం మదనపల్లె సబ్
కలెక్టర్ కార్యాలయం లో రూ. 1,00,000 మొత్తానికి చెక్కును ఆమెకు అందించారు.
అలాగే నెలవారీ 3,000 రూపాయల పింఛను అందజేయాలని కలెక్టర్ అధికారులను
ఆదేశించారు. అలాగే స్విమ్స్‌లో మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని
కూడా ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ సూచించారు.