రాజమహేంద్రవరం లో బిజెపి ముఖ్య నేతల భేటీ
రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం లో బిజెపి ముఖ్య నేతలు కీలక సమావేశం బిజెపి
రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అధ్యక్షత ను సమావేశం జరిగింది. అఖిల భారత సహ
సంఘటనా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ జీ బిజెపి రాష్ట్రంలో సంస్థాగతంగా
పటిష్టత పై మార్గదర్శనం చేశారు. బిజెపి ఎపి ఇంఛార్జి, కేంద్ర మంత్రి మురళీధరన్
మాట్లాడుతూ ఏలూరులో నిర్వహించి బిసీ సామాజిక చైతన్య సభ, ఎస్సీ మోర్చా
ఆధ్వర్యంలో సంపర్క్ అభియాన్ ,ప్రజాపోరు సభల, కార్యక్రమాలు విజయవంతం కావడంతో
ఎపి బిజెపి నేతలను అభినందించారు. బిజెపి పటిష్టత కు తీసుకున్న చర్యల ను బిజెపి
రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు సోదాహరణంగా ప్రస్తావించారు. సమావేశంలో
రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ , ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విష్ణువర్ధన్ రెడ్డి,వేటుకూరి సూర్య నారాయణ రాజు,
బిట్ర శివన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం లో సోషల్ మీడియా
రాష్ట్ర స్థాయి సమావేశం లో అనేక అంశాలు చర్చించారు. ఈ సందర్భంగా అఖిల భారత సహా
సంఘటనా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ జీ సోషల్ మీడియాలో ఏవిధంగా పని చేయాలి
అనే విషయాన్ని సోదాహరణంగా వివరించారు. మండల స్థాయిలో బిజెపి సోషల్ మీడియా
దూసుకువెళ్ళాలన్నారు. కనీసం రెండు మూడు భాషల్లో సోషల్ మీడియా వేదిక ల్లో విని
యోగించాలి. జాతీయ భావాలతో ఇతరులు కూడా పోస్ట్ లు కూడా మనం ఫాలో కావాలన్నారు.
కేంద్ర మంత్రి మురళీధరన్ మాట్లాడుతూ సోషల్ మీడియా లోని అన్ని వేదికలను
వినియోగించుకోవాలి. సోషల్ మీడియా జిల్లా లో వారీగా సంఖ్య పెంచాలి. బిజెపి
రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మాట్లాడుతూ మండలం స్థాయిలో కంటెంట్ రైటర్స్
ని పెంచుకోవాలి. సోషల్ మీడియాలో చిన్న విషయం కూడా సంచలనం సృష్టించిన సంఘటనలు
ఉన్నాయి సోషల్ మీడియా బలోపేతం చేయడానికి సన్నద్దం కావాలన్నారు. సోషల్ మీడియా
ఇంఛార్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సోషల్
మీడియా లో ప్రతి రోజూ ట్వీట్ చేయాలి. డిజిటల్ మేకింగ్ పెంచుతున్నామన్నారు.
జిల్లా వ్యాప్తంగా విషయం సేకరణ చేయడం ద్వారా మన వేదిక లు బలోపేతం చేయడానికి
వీలు కలుగుతుంది. సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ కేశవ్ కాంత్ రాష్ట్ర స్థాయి
లో బిజెపి సోషల్ మీడియా పనితీరు ను వివరించారు.