హైదరాబాద్ : తెరాస నేతలకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. దిల్లీలో అరెస్టయిన
నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్‌కు సంబంధించిన కేసులో తెలంగాణ మంత్రి గంగుల
కమలాకర్, తెరాస ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు నోటీసులు ఇచ్చింది. రేపు దిల్లీలో
జరిగే విచారణకు హాజరుకావాలని సూచించారు. అరెస్ట్ అయిన నకిలీ సీబీఐ అధికారి
శ్రీనివాస్ మంత్రి కమలాకర్‌తో టచ్‌లో ఉన్నట్లు సీబీఐ వర్గాలు
పేర్కొంటున్నాయి. తనకు ఉన్న పరిచయాల ద్వారా గ్రానైట్ వ్యవహారాలకు సంబంధించిన
కేసులో ఉపశమనం వచ్చేలా శ్రీనివాస్ ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ
క్రమంలోనే కరీంనగర్‌లోని మంత్రి ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లారు.
శ్రీనివాస్‌తో సంబంధాలు, ఎవరెవరితో మాట్లాడారు తదితర అంశాలపై గంగుల కమలాకర్,
వద్దిరాజు రవిచంద్ర వాంగ్మూలం నమోదు చేసేందుకే నోటీసులు ఇచ్చినట్లు సీబీఐ
వెల్లడించింది.