గుంటూరు : టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం
వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు
లేదన్నారు. చంద్రబాబు హయంలో ఎప్పుడైనా బీసీలకు పట్టించుకున్నారా? అని
ప్రశ్నించారు. మంత్రి కారుమూరి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం
మీడియాతో మాట్లాడుతూ ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలకు
వెన్నుదన్నుగా ఉన్నారు. అన్ని పదవుల్లో బీసీలకు సీఎం వైఎస్ జగన్ పెద్దపీట
వేశారు. బీసీల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. చంద్రబాబు పనంతా
దాచుకోవడం.. దోచుకోవడమే. మళ్లీ దోచుకోవడానికి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారు.
ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చింది చంద్రబాబే. పోలవరం నిధులను చంద్రబాబు
ఏటీఎంలా వాడుకున్నారని సాక్షాత్తు ప్రధాని మోడీయే అన్నారని తెలిపారు.