విజయవాడ : ఇటీవల నూతనంగా ఏర్పాటైన ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలోని
ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ తరఫున
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ ని ఆంధ్రప్రదేశ్
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ రాష్ట్ర కమిటీ సభ్యులు, ఏపీ
జేఏసీ అమరావతి నాయకులు కలిశారు. ఆటోనగర్ లోని నిర్మాణ భవన్ లో వారి
కార్యాలయంలో మర్యాదపూర్వకంగా వారిని కలిసి ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్
బొప్పరాజు వెంకటేశ్వర్లు ఇటీవల నూతనంగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు
సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ రాష్ట్ర కమిటీ ని స్పెషల్ చీఫ్ సెక్రటరీకి
పరిచయం చేశారు. ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఏపీ జెఏసి
అమరావతి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ
రాష్ట్ర స్థాయి కార్యవర్గం నూతన కమిటీని ప్రభుత్వ పెద్దలు, ఉప ముఖ్యంత్రి,
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, విద్యా శాఖ, మునిసిపల్ శాఖ, హౌసింగ్ శాఖ మంత్రులతో
పాటు ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్, తదితర పెద్దల సమక్షంలో నవంబర్ 27న
జరిగిన 26 జిల్లాల గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి ప్రథమ మహా
జన సభలో ఎన్నుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ తో పాటు, 26
జిల్లాల కమిటీలకు సంబంధించినటువంటి ఎంపిక పత్రాలు, తీర్మానం కాపీలను, ప్రెస్
క్లిప్పింగ్‌లను, రాష్ట్ర కమిటీ ఎన్నికల ప్రక్రియ మొత్తం కలిపి ఒక పుస్తకం
రూపంలో తయారుచేసి అజయ్ జైన్ కి అందించారు.
రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పైన జరిగే సమావేశాలకు
ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ తరఫున కూడా అవకాశం
కల్పించాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీకి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో
ఆంధ్రప్రదేశ్ గ్రామ , వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ రాష్ట్ర
అధ్యక్షులు వి. అర్లయ్య మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు
తక్షణమే చేపట్టాలని కోరారు. రెండవ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయిన
వారికి ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియను వెంటనే మొదలుపెట్టాలని కోరారు.
శానిటేషన్ సెక్రటరీలకు సంబందించి వాళ్ళు ప్రధానంగా ఎదుర్కొంటునటు వంటి
సమస్యల గురించి చర్చించారు. వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్
సెక్రటరీలకు లైన్ డిపార్ట్మెంట్ కి సంబందించి హెచ్ ఓ డీ లేకపోవడం వల్ల వాళ్ల
సమస్యలు పరిష్కారం అవ్వటం లేద ని తెలియజేశారు. ఈ విషయాలే కాకుండా, ఇంకా కొన్ని
గ్రామ వార్డ్ సచివాలయం ఉద్యోగుల న్యాయమైన సమస్యలు కూడా స్పెషల్ చీఫ్ సెక్రటరీ
దృష్టికి తీసుకుని వెళ్లగా వారు స్పందిస్తూ తప్పకుండా ఆంధ్రప్రదేశ్ గ్రామ
వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ సంఘాన్ని కూడా భవిష్యత్తులో గ్రామ
వార్డ్ సచివాలయం ఉద్యోగ సంఘాలతో జరుగబోయే సమావేశాలకు ఆహ్వానిస్తామని, అలాగే
న్యాయమైన సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి వీలైనంత త్వరగా
పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్
బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రెటరీ జనరల్ వై. వీ రావు , కోశాధికారి మురళి
కృష్ణ నాయుడు, కో చైర్మన్ మల్లీశ్వర రావు, సంగీతరావు, కోనా ఆంజనేయ కుమార్
(చంటి), క్రిష్ణ మోహన్, ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ
సంస్థ రాష్ట్ర అధ్యక్షులు వి. అర్లయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్ . గోవింద రావు,
సహా అధ్యక్షులు సాయి నాధ రెడ్డి, కోశాధికారి జగదీష్, ఉపాధ్యక్షులు హరి,
జ్యోతి, పృథ్వి రాజ్, జాయింట్ సెక్రటరీలు సుధీర్, బాందవి, కట్టా శ్రీనివాస్
తదితరులు పాల్గొన్నారు.