క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం శారీరక దృడత్వానికి, మానసిక
ఆరోగ్యానికి క్రీడలు చాలా అవసరం రాష్ట్ర పర్యాటక, క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా
తిరుపతి : క్రీడాకారులలోని నైపుణ్యాలను వెలికి తీసి వారిని జాతీయ అంతర్జాతీయ
క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక
వ్యవహారాల, యువజన సర్వీసుల క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. గురువారం
ఉదయం స్థానిక ఎస్వీ యూనివర్సిటీలోని కాంపౌండ్ నందు గల టెన్నిస్ కోర్టులో
జరుగుతున్న జగనన్న క్రీడా సంబరాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా క్రీడా శాఖ మంత్రి రోజా పాల్గొన్నారు. ఈ
సందర్భగా మంత్రి రోజా మాట్లాడుతూ క్రీడాకారులలోని నైపుణ్యాలను వెలికి తీసి
వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా తీసుకువచ్చేలా రాష్ట్ర
ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. నేను విద్యార్థి గా ఉన్నప్పుడూ
చదువుతో పాటు క్రీడలలో కూడా ఆసక్తి కనబరచడం జరిగింది. కళాకారినైన నాకు క్రీడల
పట్ల ఆసక్తిని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ మంత్రి పదవి
ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి క్రీడల పట్ల ఎంతో
సపోర్టుగా ఉన్నారని అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించి వారి నైపుణ్యాలను
వెలికి తీసి జాతీయ అంతర్జాతీయ స్థాయిలోకి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే
లక్ష్యంతో గ్రామస్థాయి నుంచి వార్డు స్థాయి వరకు క్రీడా సంబరాలను తీసుకురావడం
జరిగిందని తెలిపారు. జగనన్న క్రీడా సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలో
ఉత్సాహంగా జరుపుకోవడం జరుగుతుందని అందులో భాగంగా మొదటిగా నగిరి నియోజకవర్గంలో
వాలీ బాల్, కబడ్డీ, క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్ నుండి ఆటలను నిర్వహించడం
జరిగిందని ఈరోజు తిరుపతి లో కూడా జిల్లాస్థాయిలో ఆటలను నిర్వహించడం జరిగిందని
తెలిపారు. జిల్లా,జోనల్ స్థాయిలో పోటీలు పూర్తయిన తర్వాత డిసెంబర్ 21వ తేదీన
రాష్ట్ర ముఖ్యమంత్రి జన్మదిన రోజున ఫైనల్ గా గెలుపొందిన క్రీడాకారులకు
ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరుగుతుందని అన్నారు. హిందువులకు
ముస్లింలకు కొన్ని పండుగలు ఉన్నట్లుగానే మనం అందరూ కలిసి చేసుకునే ఒకే ఒక
పండుగ రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టినరోజున జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక
సంబరాలతో పాటు జగనన్న క్రీడా సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది చెప్పారు. ఈ
సంబరాలను జరుపుకోవడా నికి ప్రజలు, క్రీడాకారులు, కళాకారులు అందరూ ఉత్సాహంగా
ముందుకు రావడం జగనన్న సుపరిపాలనకు నిదర్శనమని తెలిపారు. పాదయాత్రలో ప్రజల
కష్టాలను స్వయంగా చూసిన ముఖ్యమంత్రి వాటిని దూరం చేసే విధంగా వారి
సంక్షేమానికి అనేక అభివృద్ది కార్యక్రమాలు తీసుకువచ్చారు. తిరుపతి పార్లమెంటు
సభ్యులు డా.ఎం గురుమూర్తి మాట్లాడుతూ క్రీడాకారులను అత్యధికంగా
ప్రోత్సహిస్తున్న రాష్ట్రాల్లో మన రాష్ట్రం ముందంజలో ఉందని అన్నారు.
గ్రామస్థాయిలో నుంచి ఎవరైతే మంచి క్రీడాకారులు ఉన్నారో వారిని ప్రోత్సహించాలని
ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. కావున ప్రతి
ఒక్కరు కూడా ఆరోగ్యకరమైన జీవితం గడిపేందుకు ఈ క్రీడల వలన విద్యార్థులకు మానసిక
ఉల్లాసమే కాకుండా, చాలా చురుకుగా అన్నీ పనుల్లో ముందుకు వెళ్లగలుగుతారని
తెలిపారు. ఒకసారి ఓడిపోయిన మళ్లీ గెలవవచ్చు అని ఆత్మవిశ్వాసంతో ముందుకు
వెళ్లాలని ఇంత పెద్ద ఎత్తున తిరుపతిలో జగనన్న క్రీడా ఉత్సవాలు జరుపుకోవడం
ఆనందంగా ఉందని తెలిపారు. తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ
పర్యాటక శాఖ లో మంత్రులుగా నియమింపబడిన వారిలో ప్రస్తుత క్రీడా శాఖ మంత్రి
రోజాలాగా జానపద కళలను వెలికి తీయడంలో ఆమెకు ఎవరు సాటి లేరని నిస్సందేహంగా
చెబుతున్నానన్నారు. క్రీడా మంత్రి రోజా విద్యార్థుల్లో క్రీడలను మరింత
ప్రోత్సహించేలా క్రీడాకారులను తీసుకువచ్చిన ఘనత రోజాకే దక్కుతుందని తెలిపారు.
తిరుపతి మేయర్ డా.శిరీష మాట్లాడుతూ మన భారతదేశంలో ఎక్కువ జనాభా ఉన్న కూడా
అన్నీ పోటీలలోమరియు క్రీడల్లో వెనుకబడి ఉన్నామని తెలిపారు. కావున క్రీడలను
ప్రోతహించాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఎంతైనా ఉందని తెలిపారు. అందుకే రాష్ట్ర
ముఖ్యమంత్రి, క్రీడా శాఖ మంత్రి క్రీడల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి జోనల్
స్థాయిలో ఈ క్రీడలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం
క్రీడా శాఖ మంత్రి రోజా, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి, తిరుపతి
పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి, మేయర్ శిరీష తో కలసి వాలీ బాల్ ఆడుతూ
క్రీడాకారులను ఉత్సాహ పరిచారు. ఈ కార్యక్రమంలో తిరుపతి కార్పొరేటర్
వెంకటేశ్వర్లు, తిరుపతి చీఫ్ కోచ్ ఉమా శంకర్, సెట్విన్ సి.ఈ.ఓ మురళి కృష్ణ,
పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.