అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ అమెరికా దాడిలో మరణించి చాలా సంవత్సరాలు
గడిచాయి. ప్రస్తుతం ఆయన కుమారుడు ఒమర్ బిన్ లాడెన్ తన తండ్రికి సంబంధించిన పలు
రహస్యాలను బయటపెట్టాడు. ఆఫ్ఘనిస్తాన్లోని అప్రసిద్ధ టోరా బోరా కొండల్లో తన
బాల్యాన్ని గడిపిన ఒమర్.. ఒసామా తనను కూడా ఉగ్రవాదిని చేయాలనుకున్నాడని
వెల్లడించాడు. ఒమర్ కు ఏకే-47 రైఫిల్‌ను ఎలా ఆపరేట్ చేయాలో కూడా ఒసామా
నేర్పించాడు. తన తండ్రి చాలా క్రూరమైనవాడని, తన కుక్కపై రసాయన ఆయుధంతో దాడి
చేశాడని ఒమర్ చెప్పాడు. అమెరికాలో 9/11 దాడిలో 3000 మందిని అల్ ఖైదా అధినేత
ఒసామా బిన్ లాడెన్ హతమార్చిన విషయం తెలిసిందే. కాగా, ఒసామా తనను టెర్రరిస్టుగా
మార్చి అల్ ఖైదాలో తన వారసుడిగా చేయాలని భావించాడని ఒమర్ చెప్పాడు. ఒమర్
ఇప్పుడు పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. బ్రిటిష్ వార్తాపత్రిక సన్ నివేదిక
ప్రకారం.. ఒసామా బిన్ లాడెన్ ఒకప్పుడు ఒమర్‌ను తన వారసుడిగా చేయాలని
భావించాడు. టోరా బోరా కొండల్లో నిర్మించిన శిక్షణా శిబిరంలో ఏకే-47 రైఫిల్‌ను
ఎలా ఆపరేట్ చేయాలో కూడా తనకు నేర్పించాడని ఒమర్ బిన్ లాడెన్ ఒక ఇంటర్వ్యూలో
చెప్పాడు. తన పెంపుడు కుక్కపై తన తండ్రి రసాయన ప్రయోగం చేశారని, అది చాలా
క్రూరంగా ఉందని ఒమర్ చెప్పాడు. ‘ నా తండ్రి ఒసామ్ నా కుక్కపై ఈ ప్రయోగం
చేశాడు, దానితో నేను సంతోషంగా లేను’ అని అతను చెప్పాడు.