టాలీవుడ్ సింగర్, బిగ్బాస్ 6 కంటెస్టెంట్ రేవంత్ ఇంట సంబరాలు జరుగుతున్నాయి.
ఆయన భార్య అన్విత తాజాగా (డిసెంబర్ 1న) పండంటి బిడ్డకి జన్మనచ్చింది. ఆమె
సోషల్ మీడియాలో ఓ వీడియోని పోస్ట్ చేసి ఈ విషయాన్ని తెలిపింది. రేవంత్
బిగ్బాస్ హౌస్లోకి వెళ్లకముందే అన్విత గర్భవతి. ఆయన హౌస్లో ఉన్న సమయంలోనే
ఆమె సీమంతం కూడా జరిగింది. హౌస్లోకి వెళ్లిన తర్వాత పుట్టబోయే బిడ్డ గురించి
రేవంత్ పలుమార్లు మాట్లాడాడు. చిన్నప్పటి నుంచి తండ్రిలేని లోటు తనకు తెలుసని,
అందుకే నాన్న అని పిలిపించుకోవడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు రేవంత్
చాలాసార్లు చెప్పాడు. పాప పుట్టిన విషయం తెలిస్తే రేవంత్ ఆనందానికి అవధులు
లేకుండా పోతాయంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. అన్విత షేర్
చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో ఎంతోమంది సినీ
ప్రముఖులతో పాటు నెటిజన్లు సైతం రేవంత్-అన్విత దంపతులకు శుభాకాంక్షలు
తెలుపుతున్నారు.