బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
నెల్లూరు : భారతీయ జనతాపార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా
అవతరించిందని, ఇది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ప్రత్యేక
కార్యపద్దతి ఇందుకు కారణమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.
నెల్లూరులో నిర్వహించిన కిసాన్ మోర్చా ప్రశిక్షణ లో ముఖ్య అతిధిగా
పాల్గొన్న సొమువీర్రాజు బిజెపి కార్యపద్దతి పై ఆయన ప్రసంగాన్ని
కొనసాగించారు. 1951 నుండి 1977 వరకు భారతీయజనసంఘ్ రూపంలో కొనసాగింది. ఆతరువాత
కాలంలో భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందిన తరువాత జాతీయవాదం, సుపరిపాలన,
పేదల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నామని వీర్రాజు వివరించారు. సమిష్టితత్వం,
సహకారంతొ బిజెపి అజేయమైన శక్తిగా మారింది బిజెపి సిద్దాంతం ఆధారంగా పనిచేయడంతో
పాటు కార్యకర్తల ఆధారితంగా పార్టీ అంచెలంచెలుగా ముందుకు దూసుకు
వెళుతున్నామన్నారు .
కార్యకర్తలు పనిచేసే సమయంలో పార్టీ మూలతత్వాలను తెలుసుకోవలసిన అవసరం ఉంది.
కార్యపద్దతిలో కార్యకర్త నిర్మాణం,కార్యకర్త వికాసం, కార్యకర్తను సంభాళించడం
అత్యంత అవసరం. పోలింగ్ బూత్ ఆధారంగా కార్యక్రమాలను నిర్మాణం చేయాల్సిన అవసరం
ఉంది. కమ్యూనికేషన్, కన్సల్టేషన్ ఈ రెండు బిజెపి కార్యకర్త పద్దతి లో చాలా
ముఖ్యభూమిక నిర్వహించడం జరుగుతుంది. సీనియర్ కార్యకర్తలు , నాయకులు పనివిధానం
ఈ సందర్భంగా సోమువీర్రాజు సోదాహరణగా వివరించారు.