7న విజయవాడలో ‘బిసి గర్జన’, 5న కర్నూలులో ‘రాయలసీమ గర్జన’ను విజయవంతం
చేయండి..!
రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పిలుపు..!
బిసిలను బ్యాక్వర్డ్ క్లాసెస్‌గా పరిగణించడం తప్పు, బ్యాక్‌బోన్
క్లాసెస్‌గా సమాజం పరిగణించాలన్నదే జగన్మోహన్ రెడ్డి ఆలోచనా విధానం అని
రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. ఈనెల 5న
కర్నూలులో జరగనున్న ‘రాయలసీమ గర్జన’ పోస్టర్లను అనంతపురం ఎంపి తలారి రంగయ్య,
ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య,
జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ తదితరులతో కలిసి శుక్రవారం రాత్రి
అనంతపురంలోని వైసిపి కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మా ప్రభుత్వానికి, మా పార్టీకి వెన్నె ముకగా
బిసిలున్నారనే విధానాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గత 40
నెలులుగా అవలంభించిన బిసిల పక్షపాత విధానాం ప్రజలకు తెలుసు. వెనుకబడిన వర్గాల
వారిని ముందుకు తీసుకువచ్చి సమ సమాజ స్థాపన చేసినప్పుడే, ఎన్నో బలిదానాలు చేసి
సాధించుకున్న స్వాతంత్రానికి ఒక విలువ ఉంటుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్
చెప్పిన విధానాన్ని జగన్మోహన్రెడ్డి అవలంభిస్తున్నారు. 7న విజయవాడలో జరిగే
బీసీ గర్జనను విజయవంతం చేయాలి.
రాయలసీమ ఆత్మగౌరవ పోరాటంగా, రాయలసీమ వెనుకబాటు తనానికి సంబంధించి అనేక
డిమాండ్లతో ఈనెల 5న కర్నూలులో ‘రాయలసీమ గర్జన’ సదస్సు నిర్వహిస్తున్నాం. 70
ఏళ్లుగా అనేక మోసాలకు గురవుతున్న రాయలసీమ ప్రాంత ప్రజల మనోభావాలను రాయలసీమ
వేదికగా స్పష్టం చేయాల్సి ఉంది. మేమంతా ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని
కోరుకునే గొప్ప మనసున్న వాళ్లం. రాజధానిని త్యాగం చేసినవాళ్లం. మా త్యాగాలను
చేతగానితనంగా చూడొద్దు. భవిష్యత్ తరాల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి
వచ్చింది. రాయలసీమ ప్రజలందరూ అభివృద్ధి వికేంద్రీకరణ కోరుతున్నారు.
రాష్ట్రంలోని 16 వేల గ్రామాల్లోనూ అభివృద్ధి జరగాలి. రాయలసీమ, అమరావతి,
ఉత్తరాంధ్రలోనూ జరగాలి. అందరూ బాగుండాలి అనే వాదనను ఈనెల 5న కర్నూలులో జరిగే
‘రాయలసీమ గర్జన’లో వినిపించబోతున్నాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఇతర మేధావులు, రాయలసీమ వాదులందరూ
వేలాదిమందిగా తరలివచ్చి విజయవంతం చేయాలని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
పిలుపునిచ్చారు.