తన స్థానంలో మరో మహిళను హత్య చేసి తానే ఆత్మహత్య చేసుకున్నానని సూసైడ్ నోట్
రాసి తన ప్రియుడితో కలిసి ప్రియురాలు పారిపోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం
నోయిడాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పాయల్ భాటి అనే మహిళ
అజయ్ ఠాకూర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. పాయల్ అతడితో కలిసి జీవించాలని
నిర్ణయం తీసుకుంది. ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. హేమ చౌదరి, పాయల్ భాటి, అజయ్
ఠా కూర్ ఒకే షాపింగ్ మాల్ లో పని చేసేవారు. ఇద్దరూ కలిసి హేమ చౌదరిని హత్య
చేశారు. అనంతరం ముఖాన్ని వేడి ఆవాల నూనెతో చిద్రం చేసి తన దుస్తులను ఆమెకు
తొడిగారు. అనంతరం తానే అత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్ నోట్ రాసింది. తన
ప్రియుడితో కలిసి పాయల్ పారిపోయింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని
సూసైట్ నోట్ పరిశీలించిన అనంతరం మృతదేహాన్ని పాయల్ బాటి కుటుంబ సభ్యులకు
అప్పగించారు. తన కూతురు కనిపించడంలేదని హేమ చౌదరి కుటుంబ సభ్యులు బిస్రాఖ్
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
వేగవంతం చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.