కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ శుక్రవారం నుంచి ఇండియా గేట్
వద్ద దివ్య కళా మేళా 2022ని నిర్వహిస్తోంది. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు
200 మంది దివ్యాంగ కళాకారులు, పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులు, నైపుణ్యాలను
ప్రదర్శిస్తున్నారు. డిసెంబరు 2న కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి
డాక్టర్ వీరేంద్ర కుమార్ ఈ మేళాను ప్రారంభించారు. ఈ ప్రదర్శన డిసెంబర్ 7 వరకు
కొనసాగుతుంది. ఇదిలా ఉండగా దివ్య కళా మేళాలో పాల్గొనేందుకు ఇత్తడి వస్తువులు
తయారు చేసే కళాకారుడు రహీం గుజరాత్లోని కచ్ నుంచి బయలుదేరారు. అతని అనుభవాలు
గమనార్హమైనవి. ప్రతికూల పరిస్థితులపై విజయం సాధించిన తీరును ఆయన వివరించాడు.
“నేను మొదట ఆవుల మెడలో వేసేందుకు గంటలు తయారు చేశాను. కానీ సమయం గడిచేకొద్దీ
ఇతర అలంకార లోహపు పనిలోకి ప్రవేశించాను. ప్రస్తుతం నేను బహుళ దుకాణాల
యజమానిని”అని రహీం చెప్పాడు.