విజయవాడ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన
తరువాత తొలిసారి ఏపీలో పర్యటించనున్నారు. రాష్ట్రపతికి పౌర సన్మానం
ఏర్పాటుచేసిన రాష్ట్ర ప్రభుత్వం, అనంతరం రాష్ట్రపతి గౌరవార్ధం రాజ్‌భవన్‌లో
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఏర్పాటుచేసిన అధికారిక విందుకు ముఖ్యమంత్రి
హాజరవుతారు.

సీఎం పర్యటన వివరాలు
ఉదయం 10.25 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు గన్నవరం
ఎయిర్‌పోర్ట్‌లో రాష్ట్రపతికి స్వాగతం పలకనున్న సీఎం, అనంతరం 11.25 – 12.15
గంటల మధ్య పోరంకి మురళీ కన్వెన్షన్ హాల్లో రాష్ట్రపతికి రాష్ట్ర ప్రభుత్వం
పౌర సన్మానం కార్యక్రమం అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 12.50
గంటలకు తాడేపల్లి నివాసం నుంచి రాజ్‌భవన్‌కు బయలుదేరి 1.00 – 2.15 గంటలకు
రాష్ట్రపతి గౌరవార్ధం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఏర్పాటుచేసిన అధికారిక విందులో
పాల్గొంటారు. అనంతరం 2.35 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో రాష్ట్రపతికి
వీడ్కోలు పలికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.