అధ్యక్షులు ఆళ్ల నాని
“జల్ జీవన్ మిషన్” ద్వారా ఏలూరు నియోజక వర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి
పనులపై క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష
ఏలూరు : వచ్చే వేసవిలో నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని ఏలూరు ప్రజలకు
త్రాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని, విలీన గ్రామాల్లో
త్రాగునీటి పైప్ లైన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర మాజీ
ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షులు ఆళ్ల
నాని అధికారులకు సూచించారు. ఏలూరు నియోజకవర్గంలో “జల్ జీవన్ మిషన్” ద్వారా
జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై శనివారం ఏలూరు శ్రీరామ్ నగర్ లోని క్యాంపు
కార్యాలయంలో రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా
వైఎస్సార్ సిపి నాయకులు ఆళ్ల నాని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
జల్ జీవన్ మిషన్ మొదటి ,2వ విడత లో భాగంగా మంజూరు అయిన పనుల పురోగతిని
అధికారులు ఆళ్ల నానికి వివరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆళ్ల
నాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో ఏలూరు
నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
అదే విధంగా ఏలూరులోని ప్రజలకు త్రాగునీటి సరఫరాలో అసౌకర్యం లేకుండా చేయటంతో
పాటు పలు చోట్ల త్రాగునీటి పైప్ లైన్ నిర్మాణాలు చేపట్టినట్లు ఆళ్ల నాని
తెలిపారు. జల జీవన్ మిషన్ పధకం ద్వారా ఏలూరు నియోజక వర్గంలో మొదటి విడత గా
ఏలూరు కి రూ 8.71కోట్లు మంజూరు కాగా మొత్తం 45 పనులు మంజూరు అయ్యాయి అని
వాటిలో 29 పనులు ఇప్పటికే పూర్తి చేయగా మరో 8 పనులు పురోగతిలో ఉన్నాయని
అన్నారు. కొత్తూరు, మాదేపల్లి, కోమడవోలులో రూ.3కోట్ల రూపాయలతో 3 ఓ హెచ్ ఎస్
ఆర్ పనులు చేపట్టినట్లు, జల జీవన్ మిషన్ ద్వారా 2వ విడత కింద మరో 2.4 కోట్లు
మంజూరు అయ్యాయని, వాటితో విలీన 7 గ్రామాల్లో త్రాగునీటి పైప్ లైన్ నిర్మాణాలు
చేపట్టనున్నామని, ఈ నెల ఆఖరు లోపు టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి, వచ్చే
మార్చి నెల నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆళ్ల నాని సూచించారు. ఈ
సమావేశంలో నగర డిప్యూటీ మేయర్ నూకపెయ్యి సుధీర్ బాబు, మున్సిపల్ కమిషనర్ షేక్
షాహిద్, మునిసిపల్, ఇంజినీరింగ్ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.