ఏలూరు జిల్లా లోని బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలకు మాజీ
ఉపముఖ్యమంత్రి, ఏలూరు శాసన సభ్యులు, ఏలూరు జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షులు
ఆళ్ల నాని పిలుపు.
ఏలూరులోని వైఎస్సార్ సిపి జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన జయహో బీసీ మహాసభ
సమాయత్త కార్యక్రమంలో ప్రసంగించిన ఆళ్ల నాని
“డిసెంబర్ 7న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైయస్సార్ కాంగ్రెస్
పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా జరగనున్న
“జయహో బీసీ మహాసభ”
ఏలూరు : బిసిల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్న జయహో బీసీ మహా సభకు ఏలూరు
జిల్లా నుంచి బిసిలు భారీ ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని రాష్ట్ర మాజీ
ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షులు ఆళ్ల
నాని పిలుపునిచ్చారు. డిసెంబర్ 7వ తేదీన విజయవాడ లోని ఇందిరా గాంధీ మున్సిపల్
స్టేడియంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న “జయహో బీసీ మహాసభ”
కు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ ఏలూరులోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ
జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు
శాసనసభ్యులు, ఏలూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆళ్ల
కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ
సందర్భంగా మాజీ మంత్రి, ఏలూరు ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా వైఎస్సార్ సిపి
అధ్యక్షులు ఆళ్ల నాని మాట్లాడుతూ బీసీల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాల
అమలుతో పాటు నామినేటెడ్ పదవుల్లో సైతం బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి
బీసీలకు అన్ని విధాలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండగా
నిలుస్తున్నారు అని అన్నారు.
బిసిలు అంటే వెనుక బడిన వర్గాలు కాదు – ఈ సమాజాన్ని ముందుకు నడిపే వెన్నుముక
వర్గాల వారు అనే నినాదంతో బిసిల అభ్యున్నతికి జగనన్న ఎంతో కృషి చేస్తూన్నారని
ఆళ్ల నాని అన్నారు. ఈనెల 7వ తేదీ ఉదయం 9గంటలకు విజయవాడ లోని ఇందిరా గాంధీ
మునిసిపల్ స్టేడియంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్న “జయహో బీసీ మహాసభ”
కార్యక్రమంలో ఏలూరు జిల్లాలోని ఏలూరు, కైకలూరు, దెందులూరు, ఉంగుటూరు, చింతల
పూడి, పోలవరం, నూజివీడు నియోజక వర్గాల నుంచి బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులు,
కార్యకర్తలు, బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని
బిసి మహాసభ ను విజయవంతం చేయాలని ఆళ్ల నాని అన్నారు.
జయహో బీసీ మహాసభకు విజయవంతం చేసి రాష్ట్రంలోని బీసీలంతా కూడా ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నారనే విషయాన్ని చాటి చెప్పి,
ప్రతిపక్షాలకు కళ్ళు తెరిపించాలని ఆళ్ల నాని అన్నారు. మాట తప్పని , మడమ
తిప్పని నేతగా, బిసిల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని
రాష్ట్రంలోని బీసీ లంతా తమ సొంత కుటుంబ సభ్యుడిలా భావించి అండగా
నిలుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు,
రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి, నగర డిప్యూటీ
మేయర్లు గుడిదేసి శ్రీనివాస్, నూకపెయ్య సుధీర్ బాబు, ఏలూరు వ్యవసాయ మార్కెట్
యార్డ్ చైర్మన్ నెరుసు చిరంజీవులు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు ఘంటా ప్రసాద
రావు, వైఎస్సార్ సిపి సీనియర్ నాయకులు బలరాం, కో-ఆప్షన్ సభ్యులు పెదబాబు,
మున్నుల జాన్ గురునాథ్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సాసుపల్లి యుగంధర్ ప్రసాద్,
కార్పొరేటర్లు పిల్లంగోళ్ల శ్రీదేవి, భీమవరపు హేమా సురేష్, కడవకోల్లు సాంబా,
సబ్బన శ్రీనివాస్, ప్రవీణ్ , జయకర్, జున్నురు నరసింహారావు, అద్దంకి హరిబాబు,
జాతీయ బీసీ సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులు భీమవరపు సురేష్, మహిళా అధ్యక్షురాలు
తుమరాడా స్రవంతి,నగర బీసీ సెల్ అధ్యక్షులు పొడిపిరెడ్డి నాగేశ్వరరావు,
వైఎస్సార్ సిపి నాయకులు లక్కొజు గోపి, దాసరి రమేష్, గూడూరి ప్రసాద్, పొలిమేర
హరికృష్ణ, ఆరేపల్లి సత్తిబాబు, ఇనపనూరి జగదీష్, ఈదుపల్లి పవన్, మోర్తా
రంగారావు, లూటుకుర్తి సుభాష్, శశిధర్ రెడ్డి, బోగిశెట్టి పార్వతి, పిట్టా
ధనుంజయ్, మోజెస్, శివరావు, పలు బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు