నెల్లూరు : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 35వ డివిజన్ చెందిన పలువురు
ముస్లిం యువత ఆసిఫ్, కాలేషా, సందాని, హర్షద్, మున్నా వారి మిత్రబృందం వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీలో ఆదివారం నూతనంగా చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వారికి పార్టీ కండువా వేసి
సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు పట్ల ఆకర్షితులై పెద్ద ఎత్తున రూరల్
నియోజకవర్గంలో వరుసగా చేరికలు జరుగుతున్నాయన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్
రెడ్డి అభివృద్ధి, సంక్షేమం ను రెండు కళ్ళుగా భావించి అమలు చేస్తున్నారన్నారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గం ను సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రూరల్
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు ఈ
కార్యక్రమంలో 35వ డివిజన్ ఇంచార్జి శరత్ చంద్ర, దాట్ల చక్రవర్ధన్ రెడ్డి,
యాకసిరి రంజిత్, కిరణ్,బాబు, సాజిత్, అస్లాం తదితరులు పాల్గొన్నారు.