నెల్లూరు : నెల్లూరు నగరంలోని నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన
ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని
గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులకు ఉద్యోగ నియామక
పత్రాలు, లాప్ టాప్ లు, మోటార్రైజ్డ్ స్కూటీలు పంపిణీ చేశారు. రాష్ట్ర
ప్రభుత్వం దివ్యాంగులను అన్ని విధాల ఆదుకుంటుందని, వారి సంక్షేమం కోసం అనేక
కార్యక్రమంలో అందించాలని ఆలోచనలతో పనిచేస్తుందని పేర్కొన్న రాష్ట్ర వ్యవసాయ
సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కచ్చితంగా అమలు
చేయడం జరుగుతుందని ప్రైవేట్ రంగంలో కూడా దివ్యాంగులకు రిజర్వేషన్
కల్పించేందుకు ప్రయత్నం చేస్తామని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హామీ
ఇచ్చారు.