కృష్ణా జిల్లా : రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్న
భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు పౌర సన్మానం జరిగింది. కృష్ణా జిల్లా
పెనమలూరు మండలం పోరంకిలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకి రాష్ట్ర ప్రభుత్వం
తరపున పౌరసన్మానం చేశారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్,
ముఖ్యమంత్రి వైయస్.జగన్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల
అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి,ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన
న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, పలువురు మంత్రులు, ఎంపీలు,
ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ
కార్యక్రమానికి హాజరయ్యారు.