విజయవాడ : ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటు మొదలైందని ఒక పత్రికలో వచ్చిన వార్త
పట్ల రాష్ట్రంలో పనిచేస్తున్న లక్షలాది మంది పోరుగుసేవ ఉద్యోగులు ఆందోళన
చెందుతూ అర్ధాంతరంగా మమ్ములను తొలగిస్తే, మా జీవితాలు ఏమయిపోవాలి అని అనేకమంది
మాకు సోషల్ మీడియా ద్వారా వారి ఆవేదనను తెలియపరచారని, ఈ విషయంలో ప్రభుత్వ
ఉన్నతాధికారులను ఏపీ జెఎసి అమరావతి పక్షాన ప్రభుత్వ మెమో గురించి కోరగా, ఆ
మెమో కేవలం డైరెక్టర్ ఆఫ్ వర్క్స్, అకౌంట్స్ శాఖలో పదేళ్ల లోపు పనిచేసే
పోరుగుసేవల ఉద్యోగులకు మాత్రమేనని, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే
వాళ్ళకి ఇచ్చామని, మిగిలిన ఏ శాఖలో పనిచేసే పోరుగుసేవల ఉద్యోగులకు – ప్రస్తుతం
వర్క్స్ ,అకౌంట్స్ లో వారికి ఇచ్చిన ఆ మెమోకు ఎలాంటి సంబంధం లేదనిఏపీ జెఎసి
అమరావతి నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, వైవీ రావు పేర్కొన్నారు.
ప్రభుత్వానికి పోరుగుసెవల ఉద్యోగులను ఎవరినీ తొలగించే ఆలోచన లేదని తెలిపారు.
కనుక, ప్రభుత్వంలో అనేక శాఖలలో పనిచేసే పొరుగుసేవల ఉద్యోగులు ఎవరూ ఈ మెమో
గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు, వైవీ రావు
తెలిపారు. అలాగే, డైరెక్టర్ ఆఫ్ వర్క్స్, అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పది
సంవత్సరాల లోపు పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాలనుకోవడం
అన్యాయమని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు, సెక్రెటరీ జనరల్ వైవీ రావు,
ఆంధ్రప్రదేశ్ కాంటాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ కే సుమన్,
సెక్రెటరీ జనరల్ డి భానోజీ రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే
ప్రస్తుతం డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ లో పదేళ్ల లోపు పనిచేసే పోరుగుసేవ
ఉద్యోగులను విదులనుండి తొలగించాలని తేదీ 1.12.2022 న ఇచ్చిన మెమో ను ప్రభుత్వం
తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏపీ జేఏసీ అమరావతి మరియు ఆంధ్రప్రదేశ్ కాంటాక్ట్
మరియు ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ పక్షాన ప్రభుత్వాన్ని కోరారు. వారు
పనిచేసే డైరెక్టర్ ఆఫ్ వర్క్స్, అకౌంట్స్ లో ఏదైనా ప్రత్యేక కారణాలు ఉంటే,
అందులో పనిచేసి పోరుగుసేవల ఉద్యోగులను మరొక శాఖలో సర్దుబాటు చేయాలి తప్ప ఇలా
తొలగించాలని మెమో ఇవ్వడం భావ్యం కాదని ఏపీ జేఏసీ అమరావతి నేతలు బొప్పరాజు
వెంకటేశ్వర్లు, వై వి రావు, ఆంధ్రప్రదేశ్ కాంటాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్
జేఏసీ నేతలు కె. సుమన్, డి. భానోజీ రావు తెలిపారు.