టీఆర్ఎస్ పాలనలో ఉద్యమకారులకు మర్యాద లేదని వెల్లడి
పరపతి కోసం సెంటిమెంట్ రగల్చడం కేసీఆర్ కు అలవాటని వ్యాఖ్యలు
హైదరాబాద్ : మాజీ మంత్రి, బీజేపీ నేత రవీంద్ర నాయక్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై
ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ పాలనలో ఉద్యమకారులకు మర్యాద లేదని పేర్కొన్నారు.
తెలంగాణ కోసం వందల మంది ప్రాణత్యాగం చేశారని, ఉద్యమకారుల పట్ల కేసీఆర్ కు కనీస
సానుభూతి లేదని మండిపడ్డారు. నాడు కొండా లక్ష్మణ్ బాపూజీ జలదృశ్యంలో తన ఇంటిని
ఆఫీసు కోసం ఇచ్చారని, ఇప్పుడది అదృశ్యమైందని అన్నారు. కేసీఆర్ తన పరపతి
కోల్పోయినప్పుడల్లా సెంటిమెంట్ రగుల్చుతారని రవీంద్ర నాయక్ విమర్శించారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కూతురిని కాపాడుకోవాలని కేసీఆర్
ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మవద్దని
పిలుపునిచ్చారు.