ఆలేరు : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అన్నారు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆలేరు పట్టణంలో ఓ వివాహ వేడుకలో ఎమ్మెల్సీ
కల్వకుంట్ల కవిత దంపతులు పాల్గొన్నారు. యాదాద్రి ఆలయ నిర్మాణం గురించి ప్రపంచ
వ్యాప్తంగా గొప్పగా చెప్పుకుంటున్నారన్న ఎమ్మెల్సీ కవిత, ఆత్మగౌరవానికి
ప్రతీకగా నిలిచే ఆలయాను గత ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేదని, కానీ సీఎం
కేసీఆర్ అద్బుతమైన టెంపుల్ సిటీని తీర్చిదిద్దారని తెలిపారు. యాదాద్రి
భువనగిరి జిల్లా ఉద్యమాల ఖిల్లా, టీఆర్ఎస్ పార్టీకి కంచు కోట అని ఎమ్మెల్సీ
కవిత తెలిపారు. ఉద్యమంలో అయినా, ఎన్నికల్లో అయినా యాదాద్రి భువనగిరి జిల్లా
ప్రజలు టీఆర్ఎస్ కు అండగా నిలబడ్డారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. 2001
నుండి జడ్పీటీసీ స్థాయి నుండి తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ప్రభుత్వ
విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతకు ప్రజలు మద్దతు పొందారని ఎమ్మెల్సీ కవిత
తెలిపారు. ఉద్యమ సమయంలో కూడా సమైక్య వాదులు ఉద్యమాన్ని ఆగం చేసిందుకు అనేక
ప్రయత్నం చేశారని, అయినా మొక్కవోని దీక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమాన్ని
నడిపి గమ్యాన్ని ముద్దాడారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.