విశాఖపట్నం : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి ప్రజా ప్రతినిధులు, అధికారులు
ఐ ఎన్ యస్ డేగాలో ఘనంగా వీడ్కోలు పలికారు. విశాఖపట్నం చేరుకొని ఆర్.కె. బీచ్
లో నిర్వహించిన నౌకాదళ దినోత్సవంలో పాల్గొన్నారు. జిల్లాలో కార్యక్రమాలు
ముగించుకొని ఐఎఎస్ డేగ విమానాశ్రయానికి చేరుకొని రాత్రి 7.42 గంటలకు ప్రత్యేక
విమానంలో తిరుపతి బయలుదేరి వెళ్ళారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి ఐఎఎస్ డేగాలో
రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్.
హరికుమార్, కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు
గుడివాడ అమర్నాథ్, విడదల రజనీ, ఫైర్ సర్వీస్ డి.జి.పి. ఎన్. సంజయ్, జిల్లా
కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున, సీపీ సిహెచ్ శ్రీకాంత్, నేవీ అధికారులు,
తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు.