అబుదాబి టీ10 లీగ్ లో ఆడాలని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని
కోరతామని ఆ లీగ్ ఛైర్మన్ షాజీ ముల్క్ చెప్పారు. టీ10 టోర్నమెంటు ప్రారంభం
అయ్యే ముందు తమకు ధోనీ టోర్నీ నిర్వహణ వ్యూహాల గురించి పలు సూచనలు చేశారని
అన్నారు. ఆయన సూచనల ప్రభావం టీ10 టోర్నమెంట్లో బాగా ఉందని చెప్పారు. ఆ
టోర్నీలోకి ఇతర ఆటగాళ్లను తీసుకునే విషయంపై ఆయన స్పందిస్తూ… రిటైర్ అయిన
ఆటగాళ్లు టీ10 లీగ్ లో ఆడేందుకు బీసీసీఐ నిబంధనలు అనుకూలంగానే ఉన్నాయని
అన్నారు. రాబిన్ ఊతప్ప కూడా తదుపరి ఏడాది నుంచి ఆడనున్నాడని చెప్పారు. సురేశ్
రైనా ఇప్పటికే లీగ్ లో ఆడుతున్నాడని అన్నారు. చాలా మంది భారతీయ ఆటగాళ్లు
ఇందులో ఆడడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కొందరు భారత ఆటగాళ్లతో
సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. అయితే, తమకు బీసీసీఐ నుంచి అనుమతి
మాత్రం రావాల్సి ఉందని చెప్పారు. అబుదాబి టీ10 సీజన్ 6లో డ్వేన్ బ్రావో,
అలెక్స్ హేల్స్, సురేశ్ రైనా, డేవిడ్ మిల్లర్, వనిందు హసరంగ, కీరొన్ పొలార్డ్,
ఎయిన్ వంటి వారు కూడా ఆడుతున్నారు.