విజయవాడ : చలో పుంగనూరు కార్యక్రమానికి తరలి రావాలని యాదవ మహాసభ నేతలు
పిలుపునిచ్చారు. సోమవారం
విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో యాదవ మహాసభ నాయకులు
మాట్లాడుతూ చిత్తూరు నియోజకవర్గం పుంగనూరులో యాదవ సంఘం సామాజిక కార్యకర్త
రామచంద్ర యాదవ్ ఇంటిపై, వారి వాహనాల పై , జరిగిన దాడి ఐదు కోట్లు నష్టం
వాటిల్లిందని అన్నారు. ఈ దాడిని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు
డాక్టర్ లాకా వెంగళరావు యాదవ్, గౌరవాధ్యక్షురాలు నూకాలమ్మ తీవ్రంగా ఖండించారు.
బిసిల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసిపి, 56శాతంగా ఉన్న తమపై దాడులు చేసి
దూరం చేసుకుంటే మనుగడ ఉండదని స్పష్టం చేశారు. రామచంద్రయ్య పై జరిగిన దాడి
ఘటనపై, విచారణచేసి, దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నెల
7,8 తేదీలలో అఖిల భారత యాదవ మహాసభ పిలుపు ఇచ్చిన చలో పుంగనూరు కార్యక్రమంలో
యాదవులతో పాటు బీసీలంతా వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ
కార్యక్రమంలో అఖిల భారత యాదవ సంఘం నాయకులు, బిసి సంఘ నాయకులు పాల్గొన్నారు.