విజయవాడ : దేశ చరిత్రలోనే ఎన్నడూలేని విధంగా బీసీలకి న్యాయం చేసిన ఏకైక
నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని మంత్రి బొత్స సత్యనారాయణ
తెలిపారు. నా రాజకీయ జీవితంలో సీఎం వైఎస్ జగన్‌లా బీసీల సంక్షేమానికి
ఆలోచించిన నాయకుడిని చూడలేదని అన్నారు. విజయవాడ ఇందిరాగాందీ మున్సిపల్
స్టేడియంలో డిసెంబర్ 7న జరగనున్న జయహో బీసీ సభా ఏర్పాట్లని మంత్రులు బొత్స
సత్యనారాయణ, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జోగి రమేష్, గుమ్మనూరి జయరాం,
ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, తలశిల రఘురాం తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా
మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ ఏలూరు బీసీ డిక్లరేషన్ని వంద శాతం అమలు
చేశాం. నామినేటేడ్ పోస్టులలో 50 శాతం రిజర్వేషన్లంటే అసాధ్యమని నేను అన్నాను.
అయితే సీఎం వైఎస్ జగన్ నామినేటేడ్ పోస్డులలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకి
రిజర్వేషన్లిచ్చి చరిత్ర సృష్టించారు. బీసీలకి న్యాయం చేసింది ఒక్క వైఎస్ జగన్
మాత్రమే. చంద్రబాబు బీసీలకి ఏం చేశారో చెప్పాలి. ఇస్త్రీ పెట్టెలు, తోపుడు
బండ్లు ఇవ్వడమేనా బీసీల సంక్షేమం అంటూ ప్రశ్నించారు. ‘అమ్మ ఒడి, ఫీజు
రీఎంబర్స్ మెంట్ లాంటి ఎన్నో సంక్షేమ పధకాలతో బీసీల జీవితమే మారిపోయింది.
మేము చెప్పిందే చేస్తాం.. చేసేదే చెబుతాం. వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలతో
బీసీలకి మార్కెట్ కమిటీల నుంచి రాజ్యసభ సభ్యుల వరకు పదవులు దక్కాయి.
మంత్రులుగా మాకు అధికారం లేదని టీడీపీ వ్యాఖ్యలు మా బలహీనవర్గాలని
అవమానించడమే. బలహీనవర్గాలకి అండగా నిలబడింది వైఎస్ జగన్ మాత్రమే. గడిచిన
మూడున్నర ఏళ్లలో బీసీలకి జరిగిన మేలు ఈ సభ ద్వారా వివరిస్తాం. రాబోయే కాలంలోనూ
బీసీలకి మరింత మేలు చేయడమే వైఎస్ జగన్ ఆలోచన’ అని మంత్రి బొత్స సత్యనారాయణ
పేర్కొన్నారు.