బ్యాక్‌బోన్ క్యాస్ట్ ఆఫ్ కంట్రీ బీసీలు
ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టీకరణ
ఎన్నికల హామీల కంటే అధికమేలు బీసీలకు చేశాం
నేడు పేదరికం నుంచి ప్రగతిపథం దిశగా బీసీల జీవనవిధానం
శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం
*విజయవాడ : మూడున్నరేళ్లలో మేం బీసీలకు ఇచ్చిన సంక్షేమం రూ.90,415 కోట్లు.
టీడీపీ ఐదేళ్ల పాలనలో ఇచ్చింది రూ.964 కోట్లు మాత్రమే. చట్టం చేసి మరీ
నామినేటెడ్ పదవులిచ్చిన ఘనత జగన్మోహన్రెడ్డిదని శాసన సభ స్పీకర్
తమ్మినేని సీతారాం వెల్లడించారు. మంగళవారం స్పీకర్ తమ్మినేని సీతారాం
విజయవాడలో ప్రెస్మీట్లో మాట్లాడారు.
బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్‌బోన్ క్యాస్ట్ ఆఫ్ కంట్రీ :
శతాబ్ధకాలం నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీలను పాలకులు విస్మరిస్తున్న చరిత్ర అందరూ
చూశారు.. అలాంటి సందర్భంలోముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెనుకబడిన,
చిన్న కులాలకు అధిక ప్రాధాన్యత కల్పించారు. ఆయన అధికారంలో లేనప్పుడు రాష్ట్ర,
జిల్లా, మండలాల స్థాయిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీల్లో ఆయా
సామాజికవర్గాలకు ప్రథమ స్థానం ఇచ్చారు. పార్టీ అధికారంలోకి రాగానే మంత్రివర్గ
విస్తరణలోనూ బీసీల ప్రాధాన్యత ఇచ్చి జగన్మోహన్రెడ్డి గారు తనదైన ప్రత్యేక
ముద్ర వేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, రాజ్యసభ సభ్యుల స్థానాల ఎంపికలోనూ
పదవులు కట్టబెట్టడంలోనూ బీసీలకు అగ్రస్థానం ఇచ్చారు.
సామాజిక న్యాయ పోరాటం చేస్తున్న యోధుడు జగన్ : ఈ రాష్ట్రంలో సామాజికన్యాయం
జరగాలి. దేశం మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. జనాభా దామషా పద్ధతిన
పాలనలో భాగస్వామ్యం కనిపించాలనే సూత్రాన్ని తూచ తప్పకుండా పాటిస్తున్న నేతగా
వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల్లో హృదయాల్లో చిరస్థాయిగా గుర్తుండిపోతారు.
‘బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు.. బ్యాక్‌బోన్ క్యాస్ట్స్ ఆఫ్
కంట్రీ’ అని జగన్మోహన్రెడ్డి రి నినాదం ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు
భవిష్యత్తులో అనేక ప్రయోజనాలు పొందుతారు. సంక్షేమ పథకాల ద్వారా ఆర్థికంగా
చేయూతతో పాటు రాజ్యాధికారంలో సింహభాగం వాటాను బీసీలు నేడు అందిపుచ్చుకున్నారు.
విద్యాదీవెన, వసతి దీవెనలతో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిదద్దడం ద్వారా
వెనుకబడిన వర్గాల ప్రజల ను సమాజానికి వెన్నెముకగా మార్చే దిశగా
మూడున్నరేళ్లుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో అడుగులు
వేస్తున్నారని సామాజిక వేత్తలు ప్రశంసిస్తున్నారు.
చట్టం చేసి మరీ పదవులిచ్చిన నాయకుడు : దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా
రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ,
మైనార్టీవర్గాలకు రిజర్వేషన్ కల్పిస్తూ.. సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఏకంగా చట్టం తెచ్చారు. రాష్ట్రంలో 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్
పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకు ఇచ్చారు. వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137
చైర్మన్ పదవుల్లో 53 బీసీలకు ఇచ్చారు. వీటితోపాటు బీసీలకు ప్రత్యేకంగా 56
కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. 137 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం
డైరెక్టర్ పదవుల్లో 201 పదవులు (42శాతం) బీసీలకు ఇచ్చారు. కార్పొరేషన్లు
ఇవ్వడమే కాకుండా వాటిద్వారా ఆయా సామాజికవర్గాల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి
తెచ్చి పరిష్కరించుకునే విధానానికి శ్రీకారం చుట్టారు.
ప్రమాణాలు కలిగిన జీవనవిధానంలోకి బీసీలు నేడు : బీసీ అంటే భారత దేశపు నాగరికత,
సంస్కృతి, సాంప్రదాయం అనేది చరిత్ర చెబుతున్న వాస్తవం. భారతదేశాన్ని వేలు
పట్టుకుని నడిపించిన చరిత్ర వెనుకబడిన కులాలకు ఉంది. మన మంచం, కంచం, చీర, నార
వస్త్రం, స్వర్ణంతో అందరికీ అన్నంపెట్టే రైతన్న భుజాన కాడి నాగలిని కూడా
బీసీలే వృత్తికారులుగా తయారు చేస్తారనే విషయాన్ని గుర్తించి బీసీల
ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు సిద్ధపడిన సామాజిక న్యాయ పోరాడ యోధుడుగా
జగన్మోహన్రెడ్డిని చూడాలి. బీసీలకు గత టీడీపీ ఐదేళ్ల పాలనలో కార్పొరేషన్ల
ద్వారా కేవలం రూ.964 కోట్లు సంక్షేమానికి కేటాయిస్తే.. వైఎస్ఆర్ సీపీ
అధికారంలోకొచ్చాక మూడున్నరేళ్లలో వివిధ సంక్షేమ కార్యక్రమాల కింద మొత్తం
రూ.90,415 కోట్లు కేటాయించింది. ఇది బీసీల పట్ల గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్
జగన్మోహన్రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి. బీసీలు పేదరికంలో ఉండకూడదని..
ప్రమాణాలు కలిగిన జీవనవిధానంలోకి మారాలన్నది ఆయన సిద్ధాంతం. అవినీతి లేని పాలన
అందివ్వాలనేది మా ప్రభుత్వ ఉద్దేశం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి మంచి ప్రజాస్పందన వస్తుంది. ఇంత గొప్ప
పాలన కొనసాగింపునకు 2024లోనూ శ్రీ జగన్మోహన్రెడ్డిని మరలా ముఖ్యమంత్రిగా
తెచ్చుకునేందుకు బీసీలు సిద్ధంగా ఉన్నారు. ఆ బాధ్యతలో భాగంగానే ఈ ‘జయహో బీసీ
మహాసభ – వెనుకబడిన కులాలే వెన్నెముక’ అనే కార్యక్రమం ద్వారా బీసీల సంసిద్ధతను
తెలియపరచనున్నారు. ముఖ్యమంత్రి జగన్ చూపుతున్న మానవత్వానికి ఎవరైనా
తలవంచాల్సిందే. నేను స్పీకర్ కాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక
సభ్యుడ్ని. కార్యకర్తను.. బీసీని. నన్ను ఎన్నికల్లో నిల్చోమని జగన్ గారు
ఆదేశించారు. ఆయన ఆదేశాలతో పోటీచేశాను. ప్రజలు నన్ను శాసనసభ్యుడ్నిగా
గెలిపిస్తే ఆయన ఏకంగా నన్ను శాసనసభాపతిని చేశాడు. నేనేదో నామినేటెడ్
స్పీకర్‌ను కాదు. ముఖ్యమంత్రి ప్రతిపాదిస్తే శాసనసభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించి
ఎన్నికైనట్లు ప్రకటిస్తే స్పీకర్‌ను అయ్యాను. గడచిన ప్రభుత్వాలు వెనుకబడిన
కులాల్ని గుర్తించడంలో సాంప్రదాయాలను గౌరవించలేదు. శాసన సభ స్పీకర్‌గా
నేనెక్కడా సాంప్రదాయాలను మీరడం లేదు. గడచిన పాలకుల హయాంలో బీసీల్ని పేదరికంతో
మగ్గేలా చేశారు. అధికారం అనే ఇనుపగజ్జెలు కట్టుకుని వాళ్ల పాదాలకింద మమ్మల్ని
అణగదొక్కారని పేర్కొన్నారు.