కుక్కీ లేబుల్‌పై రెండు పదాలు మారాగానే రుచిలో మార్పు
మానవుల్లో రుచికి సంబంధించిన భావం చాలా సున్నితమైనది. ఒకేలాంటి చాక్లెట్ చిప్
కుకీ కేవలం కొన్నిపదాలతో రుచికరమైన తీపి, తేమ నుంచి అసహ్యకరమైన చేదు, పాతదిగా
మారుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. లేబుల్ అందించిన సమాచారం ఎంత కీలకమో
చూడండి. ఒహియో స్టేట్ యూనివర్శిటీకి చెందిన 58 మంది పెద్దలతో చేసిన రుచి
పరీక్షలో, “కన్స్యూమర్ కంప్లైంట్” కుక్కీల కంటే “న్యూ అండ్ ఇంప్రూవ్డ్”
కుక్కీలు మెరుగ్గా ఉన్నాయని తేలింది.