హైదరాబాద్ : ఇండియన్ సిల్క్ గ్యాలరీ పేరుతో హైదరాబాద్‌లోని శ్రీనగర్‌కాలనీలో
ప్రారంభమైన వస్త్ర ప్రదర్శనను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సందర్శించారు. స్టాళ్లు
ఏర్పాటు చేసిన వారిలో ఐదుగురు చేనేత కార్మికులను సన్మానించిన ఆమె రాష్ట్రపతి
ద్రౌపది ముర్ముకు బహూకరించేందుకు ధర్మవరం చీరను కొనుగోలు చేశారు. ఈ సందర్భంలో
మాట్లడిన గవర్నర్ తాను ఒత్తిడికి లోనైనప్పుడు కాస్త ఉపశమనం కోసం షాపింగ్
చేస్తానని సరదాగా వ్యాఖ్యనించారు. ఒత్తిడికి లోనైనప్పుడు ఉపశమనం కోసం కొన్ని
సందర్భాల్లో షాపింగ్ చేస్తానని, చీరలు కొనుగోలు చేస్తానని రాష్ట్ర గవర్నర్
తమిళిసై తెలిపారు. శ్రీనగర్‌కాలనీలోని శ్రీసత్యసాయి నిగమాగమంలో ఈనెల 4న
ఇండియన్ సిల్క్ గ్యాలరీ పేరుతో ప్రారంభమైన వస్త్ర ప్రదర్శనను ఆమె
సందర్శించారు.

స్టాళ్లు ఏర్పాటు చేసిన వారిలో ఐదుగురు చేనేత కార్మికులను సన్మానించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తాను ఉన్నత చదువులకు కెనడా వెళ్లినప్పుడు చీరలే
ధరించానని గుర్తు చేసుకున్నారు. ఎలాంటి కుట్టులేని ఆరున్నర అడుగులున్న చీరను
బాగా ధరించారని అక్కడివారు మెచ్చుకున్నట్లు హర్షం వ్యక్తం చేశారు. శీతాకాల
విడిదికి ఈనెల ఆఖరువారంలో నగరానికి విచ్చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు
బహూకరించేందుకు ధర్మవరానికి చెందిన రామకృష్ణ అనే చేనేత కార్మికుడి నుంచి చీరను
కొనుగోలు చేశారు. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఎన్ఫోర్స్మెంట్
డైరెక్టర్ డాక్టర్ అరుణ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.