గుంటూరు, సూర్య ప్రత్యేక ప్రతినిధి : అమెరికాలో స్థిరపడ్డ కృష్ణా జిల్లా వాసి
వెంకటాద్రి బొబ్బా, పుట్టిన ఊరు, మాతృగడ్డపై మమకారంతో తను విద్యనభ్యసించిన
ఉంగుటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను అభివృద్ధి చేయాలన్న ఆశయంతో, ప్రభుత్వ
నిధులను కలుపుకుని గత ౩ సంవత్సరాలుగా అవిరళ కృషి చేసి, అంతర్జాతీయ ప్రమాణాలతో,
పూర్తిగా ఆధునీకరింపబడిన పాఠశాలను గురువారం ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ
కల్లం, ఐఏఎస్ (రిటైర్డ్), నరసాపురం మాజీ లోక్ సభ సభ్యుడు, గోకరాజు గంగ రాజు,
ప్రభుత్వ సలహాదారు, ప్రవాసాంధ్రుల వ్యవహారాలు, అధ్యక్షులు వెంకట్ ఎస్.
మేడపాటి, డిప్యూటి డైరెక్టర్ బి. విజయకుమారి, డీఈఓ తహ్ర సుల్తానా, ఆర్డీవో
పద్మావతి, ప్రజా ప్రతినిధులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు &
పేరెంట్స్ కమిటీ సమక్షంలో గన్నవరం శాసనసభ్యులు డా. వల్లభనేని వంశీ మోహన్,
శ్రీ వెంకటాద్రి బొబ్బా దంపతులు, ప్రొ. థామస్ ప్రారంభించారు. ఈ పాఠశాల
అభివృద్ధికి నిధులను పబ్లిక్ & ప్రైవేటు భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
ప్రభుత్వం, పాఠశాల అభివృద్ధి యాజమాన్యం, కమ్యూనిటీ లీడర్స్, అమెరికాలోని
ప్రవాసాంధ్రులు, ప్రవాసులు, సుబ్రహ్మణ్యం, పూర్వపు విద్యార్థులు ఈ
కార్యక్రమంలో తమవంతు ఆర్ధిక సాయమందించారు. ఇందులో దాతలు దాదాపు రూ. 3.5
కోట్లకు పైగా విరాళం సమకూర్చారు. అలాగే, ప్రభుత్వ నిధులు సుమారు రూ. 2 కోట్లు
ఉన్నాయి. ఈ పాఠశాల అభివృద్ధికి విద్యాశాఖ నుండి అవసరమైన అన్ని అనుమతులు, ఇటు
పాఠశాల ప్రధానోపాధ్యాయుడుతో ఎప్పటికప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ
ఏపీఎన్ఆర్టీఎస్ సమన్వయము చేస్తూ పూర్తి సహకారం అందించింది. ఈ సందర్భంగా
ఎమ్మెల్యే వల్లభనేని మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్
రెడ్డి విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారు. మనబడి – నాడు నేడు
కార్యక్రమం ద్వారా పాఠశాలలో మౌలికవసతుల కల్పన, పౌష్టికారంతో కూడిన మధ్యాహ్న
భోజనం, డిజిటల్ పద్ధతిలో విలువలతో కూడిన నాణ్యమైన విద్యను ప్రతి బాల, బాలికలకు
అందించడమే లక్ష్యంగా, వాటి సాధనలో సమూల మార్పులకు నాంది పలికి, మొదటి విడత
దిగ్విజయంగా పూర్తి చేసి రెండవ విడతలో భాగంగా బడుల ఆధునీకరణ
కొనసాగుతోందన్నారు. బొబ్బా ఇక్కడే చదివి తిరిగి తను చదివిన పాఠశాలను ప్రభుత్వ
– ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయడం ఎంతో ఆనందదాయకమన్నారు. ఈ ప్రక్రియలో
అవసరమైన సహకారం అందించిన అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటికి కృతఙ్ఞతలు
తెలిపారు. విద్య వలనే పేదరిక నిర్మూలన జరుగుతుంది, ప్రభుత్వం పాఠశాలకు అవసరమైన
అన్ని మౌలికవసతులు కల్పిస్తోంది. కానీ దానిని సక్రమంగా వినియోగించుకొని బాగా
చదువుకోవలసినది మాత్రం మీరే అని విద్యార్థులను ఉద్దేశించి అజయ్ కల్లం
అన్నారు. వెంకటాద్రి, ప్రొ. థామస్, కీట్స్ సభ్యులు సుబ్రహ్మణ్యం
మాట్లాడుతూ మీరందరూ భావితరాలకు ఆదర్శంగా నిలవాలని విద్యార్థులను కోరారు.
ఏపీఎన్ఆర్ టీ ఎస్ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి మాట్లాడుతూ పేద, ధనిక తేడా
లేకుండా ప్రతి ఒక్కరికి చదువు అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో మన ముఖ్యమంత్రి
వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మనబడి – నాడు నేడు ద్వారా వేల కోట్ల రూపాయలతో
బడులలో మౌలికవసతులు కల్పిస్తున్నారు. ఉచిత యునిఫామ్స్, పాఠ్యపుస్తకాలు నోటు
పుస్తకాలు, బ్యాగులు, బూట్లు, 3 జతల సాక్సులు మరియు రుచికరమైన పౌష్టికాహారం
అందిస్తోంది. దీనికి తోడు ప్రతి నీటిబొట్టు కలిసి సముద్రమైనట్టు బొబ్బాగారి
వంటి దాతలు రాష్ట్రం మీద ఉన్న ప్రేమతో ఒక్కొక్కరిని కలుపుకుంటూ దాతలను
సమకూర్చి అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన పాఠశాల భవనం, మౌలికవసతులు కల్పించడం
సంతోషకరమన్నారు. ఇలాగే వివిధ దేశాలలో స్థిరపడిన మరికొంతమంది ఎన్ ఆర్ ఐ లు
తమవంతు సాయం అందిస్తే మరింత వేగంగా విద్యారంగం అభివృద్ధి చెందుతుందన్నారు.